Xiaomi Power Bank: ప్రముఖ చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ షియోమీ (Xiaomi) తాజాగా భారత మార్కెట్లోకి కొత్త 20,000mAh కంపాక్ట్ పవర్ బ్యాంక్ ను విడుదల చేసింది. ఇందులో ప్రత్యేకతగా బిల్ట్-ఇన్ USB టైపు-C కేబుల్, 22.5W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, మల్టీ డివైస్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇది పోర్టబిలిటీకి బాగా అనువుగా రూపొందించబడింది. మరి ఈ కంపాక్ట్ పవర్ బ్యాంక్ సంబంధించిన పూర్తి ఫీచర్లు చూసేద్దామా..
ప్రధాన ఫీచర్లు:
* బ్యాటరీ సామర్థ్యం: 20,000mAh
* ఫాస్ట్ చార్జింగ్: 22.5W స్పీడ్.
* బిల్ట్-ఇన్ USB Type-C కేబుల్.
* చార్జింగ్ పోర్ట్స్: USB Type-A (ఇన్‌పుట్), USB Type-C (ఔట్‌పుట్).
* బరువు: 342 గ్రాములు.
* సెక్యూరిటీ: 12-లేయర్ ప్రొటెక్షన్ (ఓవర్‌హీట్, ఓవర్ వోల్టేజ్, షార్ట్ సర్క్యూట్, ఎలక్ట్రోస్టాటిక్ డిశ్చార్జ్ మొదలైన వాటికి రక్షణ).

Read Also:Viral Post: ప్రజలను యాప్స్ నిలువు దోపిడీలు చేస్తున్నాయా..? ఇదిగో ప్రూఫ్..
షియోమీ ప్రకారం, ఈ పవర్ బ్యాంక్ ద్వారా iPhone 16 Proకు సుమారు 4 సార్లు, Xiaomi 15 కు సుమారు 2.5 సార్లు, Redmi Note 14 Pro 5G కు సుమారు 3 సార్లు, Xiaomi Pad 7 కు సుమారు 2 సార్లు ఛార్జింగ్ అవుతుంది అని చెప్పింది. అంతేగాక, ఒకేసారి మూడు డివైస్‌లను చార్జ్ చేసే సదుపాయం కూడా ఇందులో ఉంది.
ఇక ధర, లభ్యత విషయానికి వస్తే.. జూలై 10 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది. దీని ధర రూ.1,799 గా నిర్ణయించారు. Xiaomi అధికార వెబ్‌సైట్ (mi.com), ఫ్లిప్ కార్ట్, Xiaomi రీటైల్ స్టోర్లలో అందుబాటులలో ఉండనుంది. ఈ పవర్ బ్యాంక్ ఐవీ గ్రీన్, డార్క్ గ్రే అనే రెండు రంగులలో లభ్యమవుతుంది. ఈ పవర్ బ్యాంకుకు 1 సంవత్సరం వారంటీ ఉంటుంది.

Read Also:Kingdom : కింగ్డమ్.. హిందీ రిలీజ్ కు రామ్.. రామ్
మొత్తంగా Xiaomi 20,000mAh కాంపాక్ట్ పవర్ బ్యాంకు ధరకు తగినట్లుగా ఫీచర్లను అందిస్తోంది. బిల్ట్-ఇన్ కేబుల్, ఫాస్ట్ చార్జింగ్, మల్టీ డివైస్ సపోర్ట్ వంటి అంశాలు దీనిని ట్రావెలింగ్, డైలీ యూజ్‌కు మరింత ఉపయోగకరంగా మారుస్తున్నాయి. మీరు తక్కువ బడ్జెట్‌లో ఓ హై క్వాలిటీ పవర్ బ్యాంక్ కోసం చూస్తున్నట్లయితే ఇది మంచి ఎంపిక.