NTV Telugu Site icon

Somu Veerraju: అందుకే రోడ్లు వేయరు, పంట కాలువలు, డ్రెయిన్లు క్లీన్ చేయరు..!

Somu Veerraju

Somu Veerraju

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై మరోసారి సెటైర్లు వేశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. అభివృద్ధి కార్యక్రామాలు, ఓట్లకు లింకు పెట్టిన ఆయన.. అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఓట్లు రావని.. వాటిని లైట్‌గా తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి కాల్వల్లో పూడిక కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు.. పంట కాల్వల, డ్రెయిన్ల నిర్వహణ ఒక నిరంతర ప్రక్రియలా సాగాలని.. గత ప్రభుత్వం గానీ ఈ ప్రభుత్వం గానీ పూడికతీత అంశాన్ని నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. పొలాల నుంచి డ్రెయిన్లలో పారే నీటిలో తప్పనిసరిగా సిల్టు ఉంటుంది.. అది కాల్వల్లో పేరుకుపోతుంది.. గుర్రపుడెక్క వంటి కలుపును వెంట వెంటనే తీయకపోతే విపరీతంగా వృద్ధిచెంది నీటి ప్రవాహాలను అడ్డుకుంటుందన్నారు. ఇవన్నీ ఇరిగేషన్ అధికారులకు తెలుసు, ప్రభుత్వాలకూ తెలుసు. కానీ, వాటికి నిధులు కేటాయించటం వృథా అనుకుంటున్నారు.. దానివల్ల ఓట్లు రావు.. పంచితే ఓట్లు వస్తాయన్న భావనతో పాలన సాగిస్తున్నారు.. అందుకే రోడ్లు వేయరు, పంట కాలువలు, డ్రెయిన్లు క్లీన్ చేయరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Viral: సొంత ప్రభుత్వంపైనే ఉద్యమం.. వైన్ షాపుపై పేడతో దాడిచేసిన మాజీ సీఎం..

కనీసం వేసవిలో నరేగా నిధులతో ఈ పనులు చేసేలా ఉపాధి కూలీలను ప్రోత్సహించవచ్చు అని సలహా ఇచ్చారు సోము వీర్రాజు.. తూతూ మంత్రంగా పనులే చేసి ఆ నిధులు పంచుకోవాలి అని చూస్తున్నారు.. ఇంత దుర్మార్గం జరుగుతోంది కనుకనే రైతులు వరి వేయం అంటున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరవాలి.. ప్రభుత్వం పెద్ద బాధ్యతగా ఉంటే రాష్ట్రం ముందుకు వెళ్తుందన్నారు. ఉన్న నిధులనే పొదుపుగా, సక్రమంగా, అవినీతి రహితంగా వాడితే ఈ పనులన్నింటికీ నిధులు ఉంటాయి… అసలు ప్రభుత్వమే నిర్లక్ష్యంతో అసమర్ధతతో పూడిపోతే వీటిని పట్టించుకునేదెవరు? అని నిలదీశారు. రైతులతో కలసి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు వస్తామని ప్రకటించారు సోము వీర్రాజు.