Mekapati Family: మేకపాటి కుటుంబంలో మరో వివాదం కలకం రేపుతోంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గానికి ప్రతినిథ్యం వహిస్తోన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై విడుదల చేసిన ఓ లేఖ సంచలనంగా మారింది.. తమను 18 ఏళ్లు రహస్యంగా ఉంచి విడిచిపెట్టారంటూ శివచరణ్ రెడ్డి బహిరంగ లేఖ విడుదల చేశారు.. అయితే, ఆ బహిరంగ లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.. లేఖతో పాటు, పాత ఫొటోలు కూడా వైరల్‌గా మారిపోయాయి.. ఇటీవల తనకి కుమారుడే లేడని చంద్రశేఖర్ రెడ్డి చెప్పడంపై తన లేఖ ద్వారా అభ్యంతరం వ్యక్తం చేశాడు శివచరణ్‌రెడ్డి.. మరి నేను ఎవ్వరిని అంటూ లేఖలో ప్రశ్నించాడు.. చదువుకి ఫీజులు చెల్లించడంతో బాధ్యత తీరుతుందా? అంటూ సూటి ప్రశ్నలు సంధించాడు..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
ఇక, తన తల్లి తర్వాత పరిచయమైన ఆమెని సమాజానికి పరిచయం చేశావంటూ లేఖలో చంద్రశేఖర్‌రెడ్డిని నిలదీశాడు శివచరణ్ రెడ్డి.. ఈ వ్యవహారంలో ఇప్పుడు నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.. తాను మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తనయుడిని అంటూ శివచరణ్ రెడ్డి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.. కుమారుడిగా తనని ఒప్పుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నాడు శివచరణ్ రెడ్డి… అయితే, ఈ బహిరంగ లేఖపై ఇప్పటి వరకు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు.. ఆయన ఎలా స్పందిస్తారు? అనే విషయం ఆసక్తికరంగా మారగా.. ఈ వ్యవహారం మాత్రం ఇప్పుడు మేకపాటి కుటుంబంలో కలకలం రేపుతోంది.