ఏపీ మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, మంత్రులు ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ నందిగం సురేష్ మాట్లాడారు.ఇతరులకి సహాయపడటమే నిజమైన పండుగ అని ఆయన అన్నారు. మాటకోసం పనిచేసే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ప్రజలకోసం పనిచేసే సీఎంకు అందరూ మద్దతుగా నిలబడాలన్నారు. కొన్ని దుష్ట శక్తులు పన్నాగాలతో సీఎం వైఎస్ జగన్‌పై కుట్రలు చేస్తున్నాయన్నారు. బాపట్ల ప్రజలకి, దేవుడికి, సీఎం వైఎస్ జగన్‌కి రుణపడి ఉంటానని తెలిపారు. ప్రజలందరికీ క్రిస్మస్ , నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
Also Read
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
- YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
అనంతరం మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. గతేడాది కోవిడ్ కారణంగా క్రిస్మస్ నిర్వహించుకోలేకపోయామన్నారు. వ్యాక్సినేషన్ వచ్చేంతవరకు కోవిడ్ అడ్డుకట్ట పడలేదన్నారు. కోవిడ్ సమయంలో సీఎం వైఎస్ జగన్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. చేదు జ్ఞాపకాల నుంచి తేరుకుని తగిన జాగ్రత్తలతో పండగలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ లో పుట్టిన వారిలో మేజిక్ ఉన్నట్టుంది…సమాజ పరివర్తన తీసుకురావడంలో ముందుంటారన్నారు. సీఎం వైఎస్ జగన్ కూడా డిసెంబర్ 21న పుట్టారన్నారు. గత ప్రభుత్వ సమయంలో ఆయన పై అసెంబ్లీలో ఎంతలా తప్పుగా మాట్లాడినా ఆయన దేవుడినే నమ్ముకున్నారన్నారు. విద్యార్థులకి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇస్తే కొందరూ దుర్మార్గులు తప్పుడు ప్రచారాలు చేశారన్నారు. అన్ని మతాలని గౌరవించే ప్రభుత్వం మాదేనని చెప్పారు. మీ అందరి ప్రార్థనల వల్లే వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. క్రైస్తవుల అవసరాలు తీర్చడానికి… భద్రతకి మా ప్రభుత్వం అండగా ఉంటుందని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా మూడు దశాబ్దాలకు పైగా సేవలందించాలని ఆదిమూలపు సురేష్ ఆకాంక్షించారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!