CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
- ఆక్స్ఫర్డ్ ప్రతినిధులతో సీఎం కీలక భేటీ
- హైదరాబాద్‌లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్‌కు ఆహ్వానం
- తెలంగాణ యువతకు ప్రపంచస్థాయి అవకాశాలు
- విద్య, పరిశోధనలో భాగస్వామ్యానికి గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో విద్యా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని… లండన్ లోని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ ఆహ్వానం పలికారు. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంలో భాగంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి శుక్రవారం 900 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రపంచ ప్రఖ్యాత లండన్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించారు. తెలంగాణతో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్య అవకాశాలు, రాష్ట్ర యువతకు ప్రపంచస్థాయి విద్య, పరిశోధన అవకాశాలు కల్పించే అంశాలపై ప్రముఖ విద్యావేత్తలతో విస్తృతంగా చర్చించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిధిలోని బ్లావాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌కు చెందిన ప్రొఫెసర్ మాయా ట్యూడర్, బేలియోల్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ ఫైసల్ దేవ్జీతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ రైజింగ్’ విజన్‌ను వారికి సమగ్రంగా వివరించారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికలు, చేపడుతున్న చర్యలను వివరించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తమ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు, ప్రత్యేక పరిశోధన సామర్థ్యాలు, విస్తృతమైన విద్యా వ్యవస్థను హైదరాబాద్‌కు తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. హైదరాబాద్‌లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి, తెలంగాణ యువతకు, ఉద్యోగ నిపుణులకు ప్రపంచస్థాయి విద్యా, పరిశోధన అవకాశాలు అందించేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ కీలక సమావేశంలో సీఎం కార్యాలయ సలహాదారు, ఎక్స్అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానం కింద విదేశీ విశ్వవిద్యాలయాలకు అందుబాటులో ఉన్న అవకాశాలపై ఆయన సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్, తెలంగాణలో విదేశీ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు ఉన్న అవకాశాలు, వాటికి లభించే ప్రయోజనాలను వివరించారు.
తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రొఫెసర్లు మాయా ట్యూడర్, ఫైసల్ దేవ్‌జీ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర యువత, ఉద్యోగ నిపుణులతో కలిసి పనిచేయడానికి ఆసక్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యానికి ఉన్న పలు అవకాశాలను ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రతినిధి బృందాన్ని పంపాలని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులను తెలంగాణ బృందం ఆహ్వానించింది. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చారిత్రక సోమర్విల్ కాలేజీని సందర్శించారు. ఈ కాలేజీలో విద్యాభ్యాసం చేసిన దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చిత్రపటాన్ని సందర్శించారు. 2002లో సోనియా గాంధీ ఈ చిత్రపటాన్ని సోమర్విల్ కాలేజీకి బహూకరించిన విషయం తెలిసిందే.
Also Read
- Koti Deepotsavam Day 2: కోటి దీపోత్సవం రెండో రోజు విశేష పూజలు.. అంగరంగ వైభవంగా సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
- Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. 5 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దగ్ధం.!
- CM Revanth Reddy- PM Modi: నేడు ప్రధాని మోడీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. ఈ అంశాలపై చర్చ
- Koti Deepotsavam 2026 Day-1 : కన్నుల పండువగా ముక్తీశ్వర స్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో తొలి రోజు ప్రత్యేకతలు
అనంతరం ముఖ్యమంత్రి, అక్కడే జీఎంఆర్ గ్రూప్ నిర్వహిస్తున్న యుటిలిటా బౌల్‌ను సందర్శించారు. జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంథితో కలిసి అక్కడి సమగ్ర క్రీడా సదుపాయాలను పరిశీలించారు. ఈ ప్రాంగణంలో గోల్ఫ్ కోర్స్‌తో పాటు వివిధ క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, హోటల్ ఉన్నాయి. తెలంగాణలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి జీఎంఆర్ ప్రతినిధులు, సంస్థ గ్లోబల్ స్పోర్ట్స్ యూనిట్‌తో మంతనాలు జరిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి, ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారిని ఆహ్వానించారు. శుక్రవారం సాయంత్రం ప్రస్తుత ప్రీమియర్ లీగ్ చాంపియన్స్ ఆర్సెనల్, కోవెంట్రీ మధ్య జరిగే ఈపీఎల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ముఖ్యమంత్రి ఎమిరేట్స్ స్టేడియాన్ని సందర్శించనున్నారు.
తాజావార్తలు
-
Polavaram Agency: పోలవరం ఏజెన్సీలో మంచు దుప్పటి.. ప్రకృతి అందాలకు మైమరచిపోతున్న పర్యాటకులు!
-
NASA Voyager 1 to Make History: 49 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. చరిత్ర సృష్టించనున్న NASA Voyager 1
-
U19 Asia Cup Final: పాకిస్థాన్ ప్లేయర్స్‌ను చూస్తేనే రగిలిపోతున్న టీమిండియా కుర్రాళ్లు.. వీడియోలు వైరల్
-
Manal Chauhan: లెక్కలేసుకుని ఆడాను.. కానీ భారత్‌ను గెలిపించలేకపోయా.. మనాల్ ఎమోషనల్ కామెంట్స్!
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?