Seediri Appalaraju : శ్రీకాకుళం జిల్లాలో ఆరోగ్య రంగ పరిస్థితులపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వెంటనే మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన స్థితి ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని గురుకులల్లో విద్యార్థుల్లో హెపటైటిస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని, కలుషిత ఆహారం, శుద్ధి చేయని నీరు కారణంగా ఈ వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉందని ఆయన వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (PHC) డాక్టర్లు నిరసనార్థం ధర్నాలు చేస్తున్నారని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ఆపేశారని అప్పలరాజు చెప్పారు. ఆరోగ్య శ్రీ హాస్పిటల్లు కూడా సేవలను నిలిపివేశాయన్నారు. అదనంగా, ఈ హాస్పిటల్లకు ప్రభుత్వానికి రూ. 2,700 కోట్లు బకాయిలుగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా.. మెడికల్ కాలేజీలను అమ్మి ప్రైవేట్ పరంగా మార్చడం ఒక పెద్ద తప్పని, ప్రజలకు నాణ్యమైన వైద్య విద్య అందించడమే ముఖ్యమైన అవసరం అని అన్నారు. అలాగే, 108, 104 ఆంబులెన్స్ సేవలు కనపడటంలేదని, హెల్త్ ఎమర్జెన్సీ స్థాయికి చేరుకున్నా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని ఆయన తెలిపారు. కేబినెట్ లో ప్రస్తుతం జరుగుతున్న చర్చలు కేవలం భూమి కేటాయింపుల పై మాత్రమే మించినట్లు, ప్రజల ఆరోగ్యం పై దృష్టి పెట్టడం లేదని ఆయన ఆరోపించారు. “హెల్త్ మినిస్టర్ మీడియా ముందు చిల్లర మాటలు మాత్రమే మాట్లాడుతున్నారు, కానీ వ్యవస్థ పరంగా పనులు జరగడం లేదు,” అని ఆయన వ్యాఖ్యానించారు.
Bihar Elections: ఎన్డీయే కూటమిలో తేలిన సీట్ల లెక్కలు.. ఎవరికి ఎన్ని సీట్లు అంటే..