‘సంక్రాంతి’ లాంటి పెద్ద పండుగలు వచ్చాయంటే చాలు ప్రైవేట్ ట్రావెల్స్, ప్రైవేట్ బస్సుల నిర్వాహకులకు మొదలవుతుంది అసలు పండుగ. పండక్కి సకుటుంబ సమేతంగా సొంత ఊర్లకు వెళ్లాలంటే ట్రైన్ల తర్వాత బస్సులే దిక్కు. ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, చిన్నో పెద్ద పని చేసుకుంటూ బతుకుతున్న కుటుంబాలు సంక్రాంతికి సొంత ఊరికి ప్రయాణించాలంటే ఓ నెల జీతం సరిపోదేమో. సాధారణ రోజుల కంటే పండగ సమయాల్లో 2-3 రెట్లు ధర పెంచేసి టికెట్లు విక్రయిస్తారు.
ఆర్టీసీలో సరిపడా సర్వీసులు ఉండకపోవడంతో.. ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తుంటారు. ఇదే అదునుగా రిజర్వేషన్లు, బుకింగ్‌ల పేరుతో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం నిలువ దోపిడీకి పాల్పడుతోంది. విశాఖ-హైదరాబాద్, హైదరాబాద్-విశాఖకు వెళ్లాలంటే సాధారణ రోజుల్లో టికెట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. అదే పండగ సమయంలో ఆరు వేల నుంచి 8 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. వీటన్నిటికీ భయపడి నెల రోజుల ముందస్తుగా రిజర్వేషన్లు చేసుకుంటున్నారు ప్రయాణికులు. అయినా కూడా ప్రయాణికులపై బాదుడు భారం తప్పడం లేదు.
Also Read: AP Farmers: ఓవైపు తుఫాన్‌లు, మరోవైపు ధరలు.. అల్లాడిపోతున్న రైతులు!
సంక్రాంతి పండగకి ఇంకా నెల రోజులే ఉంది. సెలవులకు సొంత ఊళ్లకు వెళ్ళడానికి ఇప్పటికే ప్లాన్ వేసుకుంటున్నారు ప్రజలు. అయితే ఫ్యామిలీలతో పండక్కి ఊరెళ్ళి తిరిగి రావడం ఆషామాషీ కాదు. సంక్రాంతి పండగ ఏమో కానీ జర్నీ విషయానికొస్తేనే గుండె గుబేలు మనేలా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. రానుపోను ప్రయాణాలు పెద్ద సమస్యగా మారింది. విశాఖ నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు.. ఇతర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్ర వైపు వచ్చే వాళ్ళు రెండు నెలలు ముందుగానే రిజర్వేషన్లు చేసుకుంటున్నారు. ఫస్ట్ ప్రియారిటి ట్రైన్ జర్నీకి ఇచ్చినప్పటికీ రిజర్వేషన్లు టికెట్స్ కొందరికి మాత్రమే దక్కుతున్నాయి. విశాఖ నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు ప్రస్తుతానికి 30 వరకు ట్రైన్లు నడుస్తున్నాయి. రెగ్యులర్ ట్రైన్స్ తో పాటు వీక్లీ ట్రైన్స్ కూడా దాదాపుగా రిజర్వేషన్లు ఫుల్ అయిపోయాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సరిపడా ప్రత్యేక రైళ్లు నడిపితే తప్ప.. సాఫీగా ప్రయాణం చేసేటట్టు కనిపించడం లేదు.