‘సంక్రాంతి’ లాంటి పెద్ద పండుగలు వచ్చాయంటే చాలు ప్రైవేట్ ట్రావెల్స్, ప్రైవేట్ బస్సుల నిర్వాహకులకు మొదలవుతుంది అసలు పండుగ. పండక్కి సకుటుంబ సమేతంగా సొంత ఊర్లకు వెళ్లాలంటే ట్రైన్ల తర్వాత బస్సులే దిక్కు. ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, చిన్నో పెద్ద పని చేసుకుంటూ బతుకుతున్న కుటుంబాలు సంక్రాంతికి సొంత ఊరికి ప్రయాణించాలంటే ఓ నెల జీతం సరిపోదేమో. సాధారణ రోజుల కంటే పండగ సమయాల్లో 2-3 రెట్లు ధర పెంచేసి టికెట్లు విక్రయిస్తారు. ఆర్టీసీలో సరిపడా…