Sajjala Ramakrishna Reddy: సీబీఐ దిగజారి వ్యవహరిస్తోంది.. ఎల్లో మీడియా స్క్రిప్ట్‌ని మెన్షన్ చేస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy Sensational Comments On CBI Over Viveka Case: తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ అఫిడవిట్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పేరును ప్రస్తావించడం వెనుక పెద్ద కుట్ర ఉందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఈ భారీ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చాలని, దీనిపై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. సీబీఐ విపరీత ధోరణికి, సెన్సేషనలైజేషన్‌కు ఇది నిదర్శనమని మండిపడ్డారు. సీబీఐ దిగజారిపోయి వ్యవహరిస్తోందని ఆరోపణలు చేశారు. వివేకా హత్య కేసులో అవినాష్‌ను, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ను టార్గెట్ చేసుకుంటూ.. ఒక పద్ధతి ప్రకారం ఎల్లోమీడియా ప్రచారం చేసుకుంటూ వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక స్క్రిప్టు రాసుకుని.. దాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం మనం చూస్తూనే ఉన్నామన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చవకబారు ఆరోపణలు చేస్తున్నారని.. కేవలం సెన్షేషనలైజేషన్ కోసమే ఇవన్నీ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
Bhatti Vikramarka : పాము పడగ నీడలో తెలంగాణ పాలన కొనసాగుతోంది
Also Read
సీబీఐ ఏం చేయాలనుకుంటుందో ఈ ఎల్లోమీడియాకు ఎలా ముందే తెలుస్తోంది? అని సజ్జల రామకృష్ణా ప్రశ్నించారు. ఎల్లోమీడియా స్క్రిప్టు తయారుచేస్తుంటే.. దాన్ని సీబీఐ మెన్షన్ చేస్తోందని అన్నారు. దర్యాప్తు సంస్థ ఏదైనా మెన్షన్ చేస్తే దానికి ఆధారాలు చూపిస్తుందని.. కానీ ఇక్కడ అదేమీ జరగలేదని అన్నారు. ముందే అనుకుని అవినాష్‌రెడ్డి అరెస్టులకు ఏం కావాలో రాస్తున్నారని.. ఆ స్క్రిప్టును ముందే ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తున్నారని ఆరోపించారు. సీబీఐ ఆ అంశాలను ప్రస్తావించగానే మేం ముందుగానే చెప్పాం కదా అని అంటున్నారని.. ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారమే సాగిపోతోందని పేర్కొన్నారు. సీబీఐ కౌంటర్ వేయకుముందే దానిలో పొందుపరిచే అంశాలను ముందుగా ఎల్లోమీడియా ప్రచారం చేస్తోందన్నారు. సీబీఐ తీరులో విపరీత ధోరణి, అత్యంత అన్యాయమైన తీరు కనిపిస్తోందని.. ఉన్నట్టుండి సీఎం జగన్ పేరు ప్రస్తావించడమే దీనికి నిదర్శనమని అన్నారు. అసలు దీనికి ఆధారమేదీ వాళ్లదగ్గర కనిపించడం లేదని, చిల్లర చేష్ట మాదిరిగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పేరుని ప్రస్తావించి, దాన్ని సెన్షేషనలైజేషన్ కోసం వాడుకోవాలన్న తీరు మాత్రమే కనిపిస్తోందన్నారు. సీబీఐ ఇలా కౌంటర్ అఫిడవిట్ విషయం తెలియగానే.. టీడీపీ పొలిట్ బ్యూరోలో దీనిపై చర్చించడం, జగన్ పాత్ర అందరికీ తెలుసంటూ వారు ఆరోపణలు చేయడం.. ఇదంతా గొలుసుకట్టు మాదిరిగా నడుస్తోందని అభిప్రాయపడ్డారు.
Balagam: అట్లుంటుంది ‘బలగం’ తోని.. కాకి ముట్టలేదని ఆ పని చేసిన కుటుంబం
ఇది ఒక పెద్ద కుట్ర అని.. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో ముందు తేల్చాలని.. దానిపై అసలు దర్యాప్తు జరగాలని సజ్జల డిమాండ్ చేశారు. ఈ కుట్రలో చంద్రబాబు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావుల పాత్రపై తేల్చాలని.. సునీత, వీళ్ల మధ్య ఏముందనేది రివీల్ చేయాలని కోరారు. సీబీఐ కౌంటర్లో పేర్కొన్న అంశంలో హేతు బద్ధత లేదని.. సీబీఐ రాసింది కాబట్టి ఈ మాటలు కూడా చెప్పాల్సి వస్తుందని చెప్పారు. ముందుగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లలో అవినాష్ పేరు లేదని.. సడన్‌గా ఓ కౌంటర్ వేసి, నిందితుడు అని చెప్తారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సీబీఐ రెండు నెలలు దస్తగిరిని తమ దగ్గర పెట్టుకుని.. అవినాష్ పేరును ప్రస్తావనకు తెచ్చేలా చేస్తారని.. ఆ తర్వాత బెయిల్ ఇస్తారని.. విచిత్రంగా ఈ బెయిల్‌ను సునీత అభ్యంతరం పెట్టదని పేర్కొన్నారు. సుమారు ఏడాదిన్నర తర్వాత అవినాష్ పేరును సీబీఐ ప్రస్తావిస్తోందని.. సడన్‌గా భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేస్తారని.. అనంతరం తర్వాత అవినాష్‌ను అరెస్టు చేయాలంటారని.. ఇప్పుడేమో కౌంటర్లో జగన్మోహన్రెడ్డి పేరును ప్రస్తావించారని చెప్పారు. అసలు వీటికి ఆధారలు ఏంటన్నది ఎవ్వరికీ తెలియదన్నారు.
Kishan Reddy : మరోసారి తెలంగాణ రైతులకు కేంద్రం మద్దుతుగా నిలిచింది
దర్యాప్తులో చూడాల్సిన కోణాలు ఎన్నో ఉన్నాయని.. కానీ వాటి జోలికి వెళ్లట్లేదని సజ్జల పేర్కొన్నారు. షమీమ్ స్టేట్మెంట్ను పట్టించుకోరు, ఆస్తి వివాదాలను ప్రస్తావించినా సీబీఐ పట్టించుకోలేదని అసంతృప్తి వెళ్లగక్కారు. పరమేశ్వరరెడ్డి అనే వ్యక్తి ఆస్పత్రిలో ఉండి.. మధ్యలో టీడీపీ నాయకుడు బీటెక్ రవిని కలిసి వస్తాడని..ఇన్ని ఉండగా వీటిని సీబీఐ పట్టించుకోలేదని అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి సమాచారం పోయిందన్న ఆరోపణ సడన్‌గా చేస్తున్నారన్నారు. అందరూ చర్చించుకోవాలన్న దృక్పథంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారే తప్ప వాటికి ఆధారాలు మాత్రం ఉండడం లేదన్నారు. దిగజారిపోయిన రాజకీయ పార్టీ మాదిరిగా సీబీఐ కూడా వ్యవహరిస్తోందని సజ్జల ఆరోపణలు చేశారు.
తాజావార్తలు
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
-
T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
-
Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
-
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి పతకం.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో సిల్వర్
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!