Sajjala Ramakrishna Reddy On Chandrababu Karakatta House Issue: గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ఉండవల్లి కృష్ణానది కరకట్టపై చంద్రబాబు అద్దెకు ఉన్న లింగమనేని నివాసం జప్తపై ఏసీబీ కోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ ఇంటిని జప్తు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ని విచారించిన ఏసీబీ కోర్టు.. ఇంటి జప్తునకు అనుమతించింది. అలాగే.. లింగమనెని రమేష్‌తో పాటు మిగతా ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఇదే సమయంలో.. మాజీ మంత్రి నారాయణకు చెందిన ఆస్తుల పాక్షిక జప్తునకు కూడా ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే.. జప్తు వ్యవహరంతో తమకేం సంబంధం లేదని టీడీపీ పేర్కొంది. తాను నివాసం ఉంటున్న ఇంటికి చంద్రబాబు అద్దె చెల్లిస్తున్నారని టీడీపీ వెల్లడించింది.
Bandi Sanjay: గోమాతను వధిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా?..ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేస్తారా?
ఈ నేపథ్యంలోనే.. లింగమనేని ఇంటికి చంద్రబాబు అద్దె చెల్లిస్తే, ఆ ఆధారాలను బయటపెట్టాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబుకు, లింగమనేనికి మధ్య ఏం ఒప్పందం జరిగిందో మీడియాకు వెల్లడించాలని కోరారు. ఒక పరిశోధన సంస్థ.. ప్రాధమిక ఆధారాలతోనే చంద్రబాబు నివాసాన్ని జప్తు చేసిందని ఆయన వెల్లడించారు. ప్రాధమిక ఆధారాలను బట్టి సంతృప్తి చెందటం వల్లే, జప్తుకు కోర్టు అనుమతి ఇచ్చిందన్నారు. పెద్ద నోరు పెట్టుకుని మాట్లాడితే.. అబద్దాలు నిజాలు అయిపోతాయన్నట్లు టీడీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కుంభకోణమే జరుగలేదు అనుకుంటే.. టీడీపీ ఎందుకు భయపడుతోంది? అని నిలదీశారు. చంద్రబాబు తన హయాంలో లింగమనేని ఇల్లు ప్రభుత్వానికి ఇచ్చినట్లు చెప్పటం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
Krithi Shetty: చిట్టి నడుముతో, ఎల్లో శారీలో గుండెలు కోస్తున్న కృతి శెట్టి
రాజకీయ కక్ష సాధింపు చేయాలనుకుంటే.. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్కరిని కేసుల్లో ఇరికించి, లోపల వేసి ఉండే వారని సజ్జల హెచ్చరించారు. కానీ, తాము అలా చేయలేదన్నారు. తగిన ఆధారాల సేకరించిన తర్వాతే విచారణ జరుగుతోంద్నారు. ఈ స్కాం చంద్రబాబు తలలో పుట్టిన ఆలోచనల నుంచి వచ్చిందని ఆరోపించారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ మార్పు చేసినట్లు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని.. టీడీపీ ఆరోపణల్ని తిప్పికొట్టారు. ఈ మొత్తం కుంభకోణంలో లింగమనేని ఇల్లు టిప్ ఆఫ్ ది ఐస్ బర్గ్ అని పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో అప్పటి మంత్రి నారాయణ లింక్‌గా వ్యవహరించాన్నారు. అధికార దుర్వినియోగానికి ఈ కేసు నిఖార్సైన ఉదాహరణ అని చెప్పిన సజ్జల.. చంద్రబాబు చేసిన స్కాంలు ఆధారాలతో సహా బయటకు వస్తాయ్నారు.