Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Sajjala Ramakrishna Reddy Fires On Chandarabau

Sajjala: చంద్రబాబు ఓ ఉన్మాదిలా మారారు.. సజ్జల తీవ్ర వ్యాఖ్యలు

Published Date :April 21, 2022 , 7:50 pm
By Sudhakar Ravula
Sajjala: చంద్రబాబు ఓ ఉన్మాదిలా మారారు.. సజ్జల తీవ్ర వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… మతి భ్రమించిన చంద్రబాబు.. నోటికి అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారు.. అందుకే చంద్రబాబుకు తెలివి తేటలు, శక్తిసామర్థ్యాలు కావాలంట.. దుర్గమ్మవారిని అవే కోరుకున్నట్లు ఆయనే చెప్పారు.. మరి ఇన్నాళ్లూ అవి లేవా? ఉంటే వాటిని కోల్పోయారా..? అంటూ ఎద్దేవా చేశారు. మంచి మనసు, ఆలోచన ఉంటే అన్నీ బాగుంటాయి.. కానీ, చంద్రబాబుకు అవేవీ లేకుండా పోయాయన్న ఆయన.. చంద్రబాబు ఒక ఉన్మాదిలా మారి బరితెగించి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా సీఎంను నిందిస్తున్నారు.. రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్లు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Lightning Strike: ఉరుములు, మెరుపులతో వర్షం.. పిడుగుపాటుకు నలుగురు బలి

పోలవరం పాపం పూర్తిగా చంద్రబాబుదే అన్నారు సజ్జల.. రైతుల శ్రేయస్సు కోసం చంద్రబాబా మాట్లాడేది..? అంటూ సెటైర్లు వేసిన ఆయన.. వైయస్సార్‌సీపీకి ఉరి వేయాలంటూ చంద్రబాబు వాగుతున్నారని.. గతి తప్పిన చంద్రబాబు ఇంకా రాజకీయాల్లో ఉండాలా? అని ఫైర్‌ అయ్యారు. విషం కక్కడమే చంద్రబాబు పని.. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్‌ వాల్‌ కూలిపోయిందని, తద్వారా ప్రభుత్వంపై రూ.800 కోట్ల భారం వేశారన్నారు. తన హయాంలో చేసిన అక్రమాల ఫలితమే ఆ డయాఫ్రమ్‌ వాల్‌ కూలిపోవడమన్న ఆయన..మళ్లీ డయాఫ్రమ్‌ వాల్‌ కట్టాలంటే మళ్లీ నీళ్లు తోడాలి.. ఎలా కట్టాలో కూడా నిపుణులకు అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే చంద్రబాబు ఆ పనులను అస్తవ్యస్తం చేశారని ఆరోపించారు సజ్జల.. ఒంగోలులో ఆర్టీఏ ఘటనలో చంద్రబాబు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.. ఎవరైనా అమ్మాయిని తీసుకు రమ్మంటే ఇంట్లో నుంచి లాక్కుని వస్తారా? అని పోలుస్తూ మాట్లాడడం అతి దారుణం అన్నారు. ఎవరో కింద ఉద్యోగి చేసిన తప్పిదాన్ని, పెద్దగా చూపి, రాష్ట్రంలో ఏదో జరిగినట్లు చెప్పడం అత్యంత దారుణమైన విషయం అని.. తాను ఒక మాజీ సీఎం అనే విషయం కూడా చంద్రబాబు మర్చిపోతున్నారు అని విమర్శలు గుప్పించారు సజ్జల రామకృష్ణారెడ్డి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chandarabau
  • CM YS Jagan
  • sajjala ramakrishna reddy
  • tdp
  • YSRCP

తాజావార్తలు

  • Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసు..15 బాల్స్‌లో హాఫ్ సెంచరీ! ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన కుర్రాడు..

  • Sam Altman Controversy: ChatGPT సీఈవోపై ఉద్యోగుల సంచలన ఆరోపణలు..

  • Anushka Shetty: అనుష్క ‘ప్రమోషన్’ పంతం వీడనుందా?

  • Hair Care Tips: సాంబ్రాణి ధూపంతో మీ జుట్టు పొడవుగా, ఒత్తుగా మారిపోతుంది తెలుసా..?

  • Kantara Part 3:రిషబ్ శెట్టి ఆ మాయా ప్రపంచానికి గుడ్ బై చెప్పేస్తున్నాడా?

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions