Sajjala Ramakrishna Reddy: బీజేపీ నేతలు ముందు ఆ ధరల గురించి మాట్లాడాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో కరెంట్ ఛార్జీల పెంపును వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమర్థించుకున్నారు. తమ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలో ఒకసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు కూడా ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో హేతుబద్దంగా స్వల్పంగా మాత్రమే విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నామన్నారు. 100 యూనిట్ల లోపు విద్యుత్ ఛార్జీలు ఇతర రాష్ట్రాల కంటే ఏపీలోనే తక్కువగా ఉన్నాయని సజ్జల అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు అర్ధం చేసుకుంటారనే నమ్మకం ఉందన్నారు.
అయితే విద్యుత్ ఛార్జీల పెంపుపై టీడీపీ గోబెల్స్ ప్రచారం ప్రారంభించిందని సజ్జల ఆరోపించారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని ఘనంగా ప్రకటించారని.. ఆయన హయాంలో పెంచిన రేట్లను ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలన అంత అద్భుతంగా ఉంటే ప్రజలు ఎందుకు 23 స్థానాలకు పరిమితం చేస్తారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్, బీజేపీ, చంద్రబాబు ఒకే గూటి పక్షులు అని సజ్జల అభివర్ణించారు.
Also Read
- IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
జయము జయము చంద్రన్న అని పోలవరం ప్రచార పాటల కోసమే వందల కోట్లు ఖర్చు పెట్టిన చరిత్ర టీడీపీది అని సజ్జల విమర్శించారు. టీడీపీది ఐదేళ్ళ బాధ్యతా రాహిత్య ప్రభుత్వమన్నారు. ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీదే పడుతుందని చంద్రబాబు తెలుసుకోవాలని సజ్జల హితవు పలికారు. కరెంట్ ఛార్జీల గురించి మాట్లాడుతున్న బీజేపీ నేతలు ముందు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల గురించి మాట్లాడాలని సజ్జల సూచించారు. పెట్రోల్, డీజిల్ రేట్లు మీటర్‌లా తిరుగుతూనే ఉన్నాయని.. వాటి గురించి బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడరని సజ్జల ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్‌కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
-
Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
-
Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
-
Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్‌పై కేసు, ఉద్యోగానికి గుడ్‌బై.!
-
Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!