ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. రాష్ట్రంలో మరో విద్యుత్ ఉద్యమానికి ఆస్కారమివ్వకండి అంటూ లేఖలో పేర్కొన్నారు.
CM Jagan: ప్రకాశం జిల్లా పర్యటనలో గ్రానైట్ పరిశ్రమలపై సీఎం జగన్ వరాలు కురిపించారు. గ్రానైట్ పరిశ్రమల విషయంలో మహానేత వైఎస్ఆర్ హయాంలో మాదిరిగానే స్లాబ్ విధానాన్ని మళ్లీ తాము తీసుకువస్తున్నామని.. ఈరోజే జీవో నంబర్ 58 విడుదల చేశామని సీఎం జగన్ ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో ఎక్కువ గ్రానైట్ పరిశ్రమలు ఉండటంతో సింగిల్ బ్లేడ్‌కు రూ.27వేలు, మల్లీ బ్లేడ్‌కు నెలకు రూ.54వేలు ఇచ్చేలా స్లాబ్ సిస్టమ్ తీసుకువస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. గ్రానైట్ పరిశ్రమల నడ్డి…
ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై టీడీపీ వినూత్న నిరసనలకు శ్రీకారం చుట్టింది. ఉగాది పర్వదినం రోజు కూడా టీడీపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ మేరకు విజయవాడలో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా చెవిలో పూలు పెట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత బుద్ధా వెంకన్న మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై…
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో పలు చోట్ల కార్యకర్తలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తిరుపతి నాలుగు కాళ్ల మండపం వద్ద టీడీపీ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. లాంతర్లు నెత్తిపై పెట్టుకుని విసనకర్రలతో విసురుకుంటూ బల్బులను మెడలో వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. చేతగాని సీఎం డౌన్ డౌన్ అంటూ…
2019 ఎన్నికలకు ముందు సీఎం జగన్ ఇచ్చిన హామీలు, ప్రస్తుతం చేస్తున్న పనులను ఉదహరిస్తూ టీడీపీ నేత నారా లోకేష్ సెటైరికల్ వీడియోను ట్వీట్ చేశారు. వైసీపీ ప్రొడక్షన్స్ సమర్పించు అత్యద్భుతమైన సినిమా ‘జనం చెవిలో జగన్ పూలు’ ఏప్రిల్ 1న విడుదల అని లోకేష్ ఈ వీడియోకు క్యాప్షన్ పెట్టారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు, మద్యనిషేధం, ప్రత్యేక హోదా, సన్నబియ్యం పంపిణీపై ఇచ్చిన హామీలను ఇప్పుడు తుంగలో తొక్కారని.. ప్రజలను జగన్ ఏప్రిల్ పూల్…
ఏపీలో కరెంట్ ఛార్జీల పెంపును వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమర్థించుకున్నారు. తమ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలో ఒకసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు కూడా ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో హేతుబద్దంగా స్వల్పంగా మాత్రమే విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నామన్నారు. 100 యూనిట్ల లోపు విద్యుత్ ఛార్జీలు ఇతర రాష్ట్రాల కంటే ఏపీలోనే తక్కువగా ఉన్నాయని సజ్జల అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు అర్ధం చేసుకుంటారనే నమ్మకం ఉందన్నారు. అయితే విద్యుత్…
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుండటంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించారు. గత ప్రభుత్వం టీడీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలను పెంచలేదా అని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన ఉచిత విద్యుత్ పథకాలను చంద్రబాబు తీసివేయలేదా అని నిలదీశారు. గతంలో విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారం వేసింది తెలుగుదేశంపార్టీనే అని మంత్రి వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. ప్రజలను ఏదో విధంగా దృష్టి మరల్చడమే టీడీపీ లక్ష్యంగా కనిపిస్తోందన్నారు.…
ఏపీలో కరెంట్ ఛార్జీల పెంపుపై ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి స్పందించారు. 2024లో జగన్మోహన్ రెడ్డికి ప్రజలే పెద్ద షాక్ ఇస్తారని ఆయన కామెంట్ చేశారు. ప్రస్తుతం ఫ్యాన్ స్విచ్ వేసే పరిస్థితిలో సామాన్య ప్రజలు లేరన్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారని ఆరోపించారు. చంద్రబాబు మీద కోపంతో రాష్ట్రాన్ని సీఎం జగన్ సర్వనాశనం చేస్తున్నారని విమర్శలు చేశారు. ఏపీని అవినీతి ప్రదేశ్, అంధకారప్రదేశ్‌గా మారుస్తున్న గొప్ప వ్యక్తి జగన్ అంటూ ఏపీ బీజేపీ…