Ratha Saptami 2023: తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి.. రథసప్తమి వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒకేరోజు ఏడు వాహనాలపై మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు. ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనంతో శ్రీవారి వాహన సేవలు ప్రారంభం అయ్యాయి.. ఇక, ఉదయం 9 గంటలకు చిన్నశేష వాహనం, ఉదయం 11 గంటలకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 గంటలకు చక్రస్నానం, సాయంత్రం 4 గంటలకు కల్పవృక్షవాహనం, సాయంత్రం 6 గంటలకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇస్తారు మలయప్పస్వామి..
Read Also: Post Office Jobs: పదో తరగతితో ప్రభుత్వ ఉద్యోగం.. పోస్టాఫీసుల్లో 40 వేలకు పైగా కొలువులు
మరోవైపు.. రథసప్తమి సందర్భంగా సర్వదర్శనం భక్తులుకు జారీచేసే టోకెన్లు, వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ.. అడ్వాన్స్ విధానంలో వసతి గదులు కేటాయింపును కూడా రద్దు చేశారు. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. 14 కంపార్టుమెంట్లలో వేచిఉన్నారు భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది.. మరోవైపు.. నిన్న శ్రీవారిని 59,695 మంది భక్తులు దర్శించుకున్నారు.. 30,286 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. నిన్న హుండీ ద్వారా ఆదాయం రూ.4.06 కోట్లు వచ్చినట్టు టీటీడీ ప్రకటించింది.