Andhra Pradesh: అభివృద్ధిలో ఆదర్శ నియోజకవర్గంగా పులివెందుల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల్లో అత్యాధునిక హంగులతో నిర్మించిన నూతన బస్ టెర్మినల్‌ను సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. మూడు రోజుల పర్యటన కోసం వైఎస్ఆర్ కడప జిల్లాకు విచ్చేసిన సీఎం జగన్ శనివారం నాడు పులివెందులలో నూతనంగా నిర్మించిన బస్ టెర్మినల్ ను ప్రారంభించారు. అనంతరం బస్ టెర్మినల్ ను సీఎం జగన్ స్వయంగా పరిశీలించి, ఆర్టీసీ కార్యాలయం, కాంప్లెక్స్ నిర్మాణ శైలిని ప్రయాణికుల సదుపాయాలను పరిశీలించారు. ప్రారంభోత్సవానికి ముందు సీఎం జగన్ దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు. బస్ స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి వచ్చిన స్థానిక మహిళలు, చిన్నారులు నాయకులను ఆయన ఆప్యాయంగా పలకరించారు. అనంతరం బస్ టెర్మినల్ ప్రారంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు.
Read Also: Drugs Gang Busted: ఓర్నీ భలే ఐడియా.. పెళ్లి బట్టల్లో డ్రగ్స్.. గ్యాంగ్ గుట్టురట్టు
Also Read
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్‌తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
పులివెందులను ఆదర్శ నియోజకవర్గం చేయడం కోసం మూడున్నరేళ్లుగా సమున్నత అడుగులు పడ్డాయన్నారు. అందులో భాగంగానే అత్యాధునిక వసతులతో మోడల్ టెర్మినల్ తరహాలో పులివెందుల్లో బస్ టెర్మినల్ నిర్మించడం జరిగిందన్నారు. ఈ బస్ టెర్మినల్ మిగతా వాటన్నిటికీ రోల్ మోడల్‌గా నిలుస్తుందని హామీ ఇచ్చారు. పులివెందులలో బస్ టెర్మినల్ కూడా కట్టలేని స్థితిలో ఉన్నారని విమర్శించిన చంద్రబాబుకు ఈ బస్ టెర్మినల్ చూస్తే వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో తెలుస్తుందని చురకలంటించారు. ప్రస్తుత పులివెందుల బస్ టెర్మినల్ చూస్తే వాళ్లకు అసూయ కలుగుతుందన్నారు. ఈ రోజు రాష్ట్రంలో పేద ప్రజల తలరాతలు మారుతున్నాయంటూ ఆనందం వ్యక్తం చేశారు. సంక్షేమం దిశగా వివక్ష లేని దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నామన్న సీఎం జగన్, సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా ప్రజల ఖాతాల్లోకి చేరుస్తున్నామని పేర్కొన్నారు.
రూ. 13 వేల కోట్లతో పులివెందుల మీదుగా ఆరు లైన్ల హైవే..
రాష్ట్రంలో పులివెందుల నుంచి బెంగళూరు వరకు నాలుగు లేన్ల హైవే నిర్మాణం కోసం కేంద్రంతో చర్చలు జరుపుతున్నట్లు సీఎం జగన్ వివరించారు. దీంతో పాటు రూ.13 వేల కోట్ల ఖర్చుతో బెంగుళూరు నుంచి పులివెందుల మీదుగా విజయవాడ వరకు ఆరు లైన్ల రహదారి విస్తరణ కృషి చేస్తున్నట్లు తెలిపారు. పులివెందుల పట్టణంలోని ఐదు జంక్షన్లలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ప్రజల చిరకాల కోరిక అయిన రాయలపురం బ్రిడ్జిని కూడా ప్రారంభించామన్నారు. సంక్షమం అభివృద్ధి రెండు కళ్ల తరహాలో అభివృద్ధి జరుగుతున్నా ఎల్లో మీడియా అవేం పట్టనట్లు తప్పుడు ప్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, వీరి దత్తపుత్రుడు వంటి చెడిపోయిన వ్యవస్థలతో మనం యుద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి వీరికి కనపడదు వినపడదు అన్నట్లుగా తప్పుడు రాతలు రాస్తున్నారని పేర్కొన్నారు. ఈ తప్పుడు రాతలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. పులివెందుల ప్రజలు నాకు ఇస్తున్న భరోసాతోనే వచ్చే ఎన్నికల్లో మనం 175 స్థానాల్లో విజయం సాధించగలమన్నారు. ఈ సంకల్పంతో వైసీపీ మొక్కవోని దీక్షతో పనిచేస్తోందని వివరించారు.
తాజావార్తలు
-
Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్‌లోనూ ఉద్యోగ బాధ్యతలు
-
Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
-
Moto G Max: మోటో జీ మ్యాక్స్ భారత్‌లో త్వరలో లాంచ్.. 50MP Sony కెమెరా, Snapdragon చిప్
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్‌గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
ట్రెండింగ్
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!