Dr. Prem Sagar Reddy: సీఎం జగన్ అనేక గొప్ప పనులు చేస్తున్నారు.. తన తండ్రిలా చక్కటి పాలన అందిస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dr. Prem Sagar Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అనేక గొప్ప పనులు చేస్తున్నారు.. తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలా చక్కటి పాలన అందిస్తూ ప్రజల మన్ననలు చూరగొంటున్నారని ప్రశంసలు కురిపించారు ప్రైమ్ హెల్త్‌కేర్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డి.. ఇవాళ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు ప్రేమ్‌సాగర్ రెడ్డి.. ప్రైమ్ హెల్త్ కేర్ ఆధ్వర్యంలో అమెరికాలోని 14 రాష్ట్రాలలో 46 ఆసుపత్రులు నిర్వహిస్తూ, యూఎస్‌లోని టాప్ టెన్ వైద్య వ్యవస్ధల్లో ఒకటిగా ప్రైమ్ కేర్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.. సీఎంతో సమావేశం అనంతరం డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్‌తో జరిగిన సమావేశం మంచి సహృద్బావ వాతావరణంలో జరిగింది, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాకు మంచి స్నేహితుడు, అలాగే నా సహాధ్యాయి. మేం వివిధ అంశాలపై చర్చించాం, అందులో ప్రధానంగా ఏపీలో ఆరోగ్యరంగంపై చర్చ జరిగింది, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ చాలా బావుంది, ఏపీలో 98 శాతం డాక్టర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది నియామకం జరగడం గొప్ప విషయం అన్నారు..
Also Read
ఇక, ఏపీకి డిజిటల్ ఎక్స్‌రే మిషన్లు, అత్యాధునిక మెడికల్ ఎక్విప్‌మెంట్‌ను ఇవ్వడానికి నేను సిద్దంగా ఉన్నానని వెల్లడించారు.. కోవిడ్ సమయంలో కూడా అతి తక్కువ వ్యవధిలో 1500 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌లు ఇచ్చాను. పేదలకు ఇళ్లు, ఆరోగ్యశ్రీ, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలో చాలా చక్కగా సీఎం అభివృద్ది చేస్తున్నారు. ఈ రాష్ట్రం కోసం అనేక గొప్ప పనులు చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో ఏపీ ప్రభుత్వంలో నేను భాగస్వామ్యం కావడం చాలా గర్వంగా, సంతోషంగా ఉంది.. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు ప్రైమ్ హెల్త్‌కేర్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డి.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..