Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Pullalacheruvu Vice Mpp Election Caused A Rift Between The Couple The Wife Left Her Home

Vice MPP Election: దంపతుల మధ్య చిచ్చు పెట్టిన వైస్ ఎంపీపీ ఎన్నిక.. పుట్టింటికి వెళ్లిపోయిన భార్య..!

Published Date :March 28, 2025 , 12:25 pm
By Sudhakar Ravula
  • భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టిన మండలపరిషత్ ఎన్నికలు..
  • పుల్లలచెరువు మండల పరిషత్‌లో వైస్ ఎంపీపీ ఎన్నికలో ఘటన..
Vice MPP Election: దంపతుల మధ్య చిచ్చు పెట్టిన వైస్ ఎంపీపీ ఎన్నిక.. పుట్టింటికి వెళ్లిపోయిన భార్య..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vice MPP Election: ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల.. జడ్పీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు జరగుతున్నాయి.. అయితే, ప్రకాశం జిల్లాలో మండలపరిషత్ ఎన్నికలు భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టింది.. పుల్లలచెరువు మండల పరిషత్‌లో వైస్ ఎంపీపీ ఎన్నిక జరిగింది.. ఈ ఎన్నికలో టీడీపీ నాయకులు.. వైసీపీ ఎంపీటీసీ నాగేంద్రమ్మ భర్త పొలయ్య మధ్య చిచ్చు పెట్టి అగ్గిరాజేశారట.. పూర్తి వివరాల్లోకి వెళ్లే పుల్లలచెరువు మండలంలో వైసీపీ ఎంపీటీసీగా ఉన్నారు నాగేంద్రమ్మ.. అయితే, ఆమె భర్త పోలయ్య.. ముటుకుల గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్‌లో కాంట్రాక్టు పద్ధతిలో వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.. మండల పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తే.. నీ ఉద్యోగం తీసేస్తామని టీడీపీ నాయకులు బెదిరించినట్టుగా తెలుస్తోంది.. దీంతో, తన భార్యను వైసీపీకి ఓటు వేయవద్దు టీడీపీకి ఓటు వేయాలని భర్త ప్రాధేయపడ్డాడట.. వైసీపీకి ఓటు వేస్తే నా ఉద్యోగం పోతుందని తెలిపాడట.. అయితే మండల పరిషత్ ఎన్నికల్లో భర్త పోలయ్య మాట వినకుండా నాగేంద్రమ్మ వైసీపీకి ఓటు వేయడంతో ఇద్దరి మధ్య వివాదం ప్రారంభమైనట్టు తెలుస్తోంది..

Read Also: Mad Square Review: మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

అయితే, వైసీపీ నాయకులు నాగేంద్రమ్మకు బుజ్జగించి వైసీపీకి ఓటు వేయించుకున్నారని తెలుస్తుంది.. మండల పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసిన ఎంపీటీసీ నాగేంద్రమ్మ తనను భర్త పోలయ్య ఏమైనా అంటాడేమోనన్న భయంతో పుట్టింటికి వెళ్లిపోయింది.. మరోవైపు, పోలయ్యను కలిసి వైసీపీ నాయకులు.. ఆయన్ని బుజ్జగించి నీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారట.. దీంతో, సమస్య పరిష్కారం అయ్యింద.ఇ. పుట్టింటికి వెళ్లిన ఎంపీటీసీ నాగేంద్రమ్మను ఈ రోజు వెళ్లి భర్త పోలయ్య తీసుకువస్తాడని.. వైసీపీ నేతలు చెబుతున్నారు.. ఏది ఏమైనా మండల పరిషత్ ఎన్నికలు భార్య భర్తల మధ్య అగ్గిరాజేసి ఆగదాన్ని పెంచినట్టు అయ్యింది.. కాగా, పుల్లలలచెరువు మండల పరిషత్ వైస్ ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీకి విజయం వరించింది.. మొత్తం 15 స్థానాల్లో ఒక వ్యక్తి హాజరు కాకపోవడంతో 14 సభ్యులకు సంఖ్య బలం పడిపోయింది.. వైసీపీ 7.. టీడీపీ 7 ఓట్లతో చేరి సమానంగా ఓట్లు రావడంతో ఉత్కంఠగా ఎన్నికల ప్రక్రియ ఏర్పడింది.. అధికారులు డ్రా తీయడంతో వైసీపీ అభ్యర్థి లింగంగుట్ల రాములు విజయం సాధించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • couple
  • Pullalacheruvu
  • Vice MPP Election
  • wife

తాజావార్తలు

  • Petrol Price Hike: పెట్రోల్‌, డీజిల్‌పై రూ.55 పెంపు.. అక్కడ రూ.321కి చేరిన లీటర్‌ పెట్రోల్‌ ధర..

  • Deepika Padukone : మౌనం వీడిన దీపికా.. భర్త రణవీర్ తో కలిసి సందడి

  • Putin praises Iran: ఉద్రిక్తతల మధ్య పుతిన్ ఇరాన్‌కు సాలిడ్ సపోర్ట్.. రష్యా నమ్మకమైన స్నేహితుడు అంటూ సందేశం

  • CAPF Bill: ఢిల్లీలో నేతలు బిజిబిజీ.. నేడు రాజ్యసభలో “కేంద్ర సాయుధ పోలీసు బలగాలు” (CAPF) బిల్లు..!

  • MS Dhoni IPL Retirement: ఇదే చివరి సీజనా..? ఐపీఎల్‌ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన ధోనీ.. వీడియో వైరల్..

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions