Ambati Rambabu: రాజధానిని నిర్మించే స్థాయిలో ఏపీ ఉందా..? అమరావతిపై అంబటి సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: ప్రకాశం జిల్లాలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు.. రాష్ట్ర రాజధాని అమరావతి అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో భారీ స్థాయిలో రాజధాని నిర్మాణం సాధ్యమేనా అని ప్రశ్నించారు. రాజధాని పేరుతో అప్పులు చేసి కొందరికి లాభాలు చేకూర్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. చంద్రబాబుకు వైసీపీని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేదని అంబటి విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చినప్పటి నుంచి వివిధ రకాలుగా ట్రోల్ చేశారని అన్నారు. అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.
Read Also: Inter Exam Fee: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు చెల్లింపు గడువు పెంపు..
Also Read
- Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
- Earthquake In Ongole: ఒంగోలులో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
- Markapuram Bus Fire Accident: మార్కాపురం బస్సు దగ్ధం.. బస్సు ఓనర్ కమ్ డ్రైవర్ హరికృష్ణ అరెస్ట్..!
- Markapuram Road Accident: 14 మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి.. మృతదేహాల గుర్తింపుకోసం డీఎన్ఏ టెస్ట్..
అమరావతిలో భవన నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.16 వేల వరకు ఖర్చు చూపడం దేశంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు అంబటి… రాష్ట్రాన్ని కొందరు దోపిడీదారులకు అప్పగించేలా ప్రణాళికలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాంట్రాక్టులు ఇచ్చి కిక్‌బ్యాక్స్ రూపంలో నిధులు వెనక్కి తీసుకుంటున్నారని విమర్శించారు. “అసలు అమరావతి ఎక్కడుంది.. రాజధాని ఎక్కడుంది” అంటూ అంబటి వ్యాఖ్యానించారు. గుంటూరు వెళ్లి బస్ టికెట్ అడిగితే అమరావతి గుడికి టికెట్ ఇస్తారని వ్యంగ్యంగా అన్నారు. సంపద సృష్టి అనే మాటలు నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికే వర్తిస్తాయని విమర్శించారు.
రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధరలు లేవని అంబటి రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు పక్కనపెట్టి రాజధాని పేరుతో అప్పులు చేయడం తప్ప ప్రజలకు ఉపయోగం లేదన్నారు. రాజధానిలో దోచుకోవడానికి నిధులు ఉన్నా, పేదలకు పథకాలు ఇవ్వడానికి నిధులు లేవని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వంపై రెండేళ్లలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని అంబటి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులు కాకుండా ప్రజలు స్వేచ్ఛగా ఓటేస్తే వైసీపీదే విజయం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.
ఇక, జాతీయ రాజకీయాలపై కూడా అంబటి వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సీఎం చంద్రబాబు నాయుడు మధ్య హాట్‌లైన్ ఇంకా కొనసాగుతోందని అన్నారు. మహిళా బిల్లు ఓటింగ్ సందర్భంగా జరిగిన పరిణామాలపై కూడా చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు..
తాజావార్తలు
-
Samsung Galaxy M47 5G: సామ్ సంగ్ గెలాక్సీ M47 5G టీజర్ విడుదల.. Snapdragon 6 Gen 3 చిప్సెట్తో త్వరలో లాంచ్
-
Bandi Bhagirath: పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్..
-
Rukmini Vasanth : AIతో మార్ఫింగ్ వీడియోలు.. నటి రుక్మిణి వసంత్ పేరుతో అసభ్యకర ప్రచారం.. ముగ్గురి అరెస్ట్
-
Tata Sierra EV: టాటా సియెర్రా EV టీజర్ విడుదల.. ఫస్ట్ లుక్ అదిరింది.. భారీ బ్యాటరీ, ప్రీమియం ఫీచర్లతో ఎంట్రీ
-
Siddipet District: కసాయి తల్లి.. ప్రియుడితో ఏకాంతానికి అడ్డొచ్చాడని రెండేళ్ల కొడుకును హతమార్చిన వైనం..
ట్రెండింగ్
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!