పవన్ కల్యాణ్ వైజాగ్ సభ.. పోలీసుల అనుమతి నిరాకరణ..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నం టూర్‌కు సిద్ధం అయ్యారు.. రేపు విశాఖలో పర్యటించనున్న ఆయన.. విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులకు అండగా పోరాటంలో పాల్గొననున్నారు.. ఓవైపు ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్రం ముందుకు సాగుతున్నా.. మరోవైపు పోరాటం కొనసాగిస్తున్నారు కార్మికులు.. వారికి ఇప్పటికే బీజేపీ మినహా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించగా.. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యక్షంగా మద్దతు తెలపనున్నారు.. అయితే, వైజాగ్‌లో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ వేదికపై సందిగ్ధత నెలకొంది.
స్టీల్ ప్లాంట్ మెయిన్ రోడ్డు పై సభ ఏర్పాటుకు సిద్ధం అయ్యాయి జనసేన శ్రేణులు.. ఇప్పటికే ఆ ప్రాంతానికి లారీల్లో స్టేజ్ మెటీరియల్ తరలించారు.. అయితే, ఆ ప్రాంతంలో సభకు మాత్రం ఇంకా పోలీసులు అనుమతి ఇవ్వలేదు.. స్టేజ్ ఫేసింగ్ పై పోలీసులు, సభ నిర్వాహకుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ సమస్య వచ్చినట్టుగా తెలుస్తోంది.. పవన్ కల్యాణ్ సభకు వేలాదిగా జనం తరలివస్తే జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోతుందని పోలీసులు అభ్యంతరం చెబుతున్నారు.. కానీ, సభకు వచ్చేవారిని అడ్డుకోవడానికే పోలీసులు అభ్యంతరాలు చెబుతున్నారంటూ జనసేన పార్టీ ఆరోపిస్తుంది. ఈ పరిస్థితుల్లో స్టేజ్ ఎక్కడ ఏర్పాటు చేస్తారు..? పోలీసుల అనుమతి మాట ఏంటి? అనేదానిపై క్లారిటీ రావాల్సిఉంది.
Also Read
- Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
- Gudivada Amarnath: డేటా సెంటర్‌పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్‌లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
తాజావార్తలు
-
Bajaj Chetak C2501 STD: బజాజ్ చేతక్ సిరీస్‌లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు & స్పెసిఫికేషన్స్
-
Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
-
Bank Holiday May 2026: మే నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే?
-
Shreyas Iyer: “222 కొట్టినా ఓడామంటే బాధగా ఉంది”.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
-
Aditya Dhar: మరోసారి ‘ధురంధర్’ కాంబో రిపీట్ ..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో