ఏపీలో రానున్న రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై అలుపెరుగని పోరాటం చేస్తామన్నారు జనసేన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్. విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన సభను చూస్తే జనసేనకు జనం బ్రహ్మరధం పడుతున్నారని అర్థమైందన్నారు. కేంద్రానికి పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని చెప్పారన్నారు. వైఎస్సార్ ప్రభుత్వం కేంద్రం మీద వత్తిడి తీసుకురాలేదన్నారు దుర్గేష్. స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై అఖిల పక్షం వేయాలని పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారని, అయితే…
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటానికి మద్దతుగా జనసేనాని బహిరంగ సభ జరగనుంది. ఈ సభ కోసం ఇప్పటికే విశాఖ చేరుకున్నారు పవన్ కళ్యాణ్.ఆయనకు అడుగడుగునా వేలాదిమంది స్వాగతం పలికారు. వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు పవన్ కళ్యాణ్.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నం టూర్‌కు సిద్ధం అయ్యారు.. రేపు విశాఖలో పర్యటించనున్న ఆయన.. విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులకు అండగా పోరాటంలో పాల్గొననున్నారు.. ఓవైపు ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్రం ముందుకు సాగుతున్నా.. మరోవైపు పోరాటం కొనసాగిస్తున్నారు కార్మికులు.. వారికి ఇప్పటికే బీజేపీ మినహా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించగా.. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యక్షంగా మద్దతు తెలపనున్నారు.. అయితే, వైజాగ్‌లో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ వేదికపై సందిగ్ధత నెలకొంది.…