Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Police Busted Rave Party In Guntur District

పోలీసుల రేవ్‌పార్టీ..! స్థానికుల సమాచారంతో రైడ్.. సీఐని సైడ్‌ చేసి..!

Published Date :August 3, 2021 , 10:07 pm
By Sudhakar Ravula
పోలీసుల రేవ్‌పార్టీ..! స్థానికుల సమాచారంతో రైడ్.. సీఐని సైడ్‌ చేసి..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

గుంటూరులో సంచలనం రేపిన రేవ్ పార్టీ వ్యవహారం పోలీసుల వ్యవహారశైలిని బయటపెట్టింది. లక్ష్మీపురంలోని ఓ బిల్డింగ్‌ నుంచి… అరుపులు, కేకలు వినిపించడంతో… విసిగిపోయిన స్థానికులు… అక్కడికి వెళ్లి చూశాడు. రేవ్‌ పార్టీ జరుగుతుండడంతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ, అక్కడున్న పోలీస్ అధికారి… వారికి వార్నింగ్‌ ఇచ్చి పంపారు. ఇలా కాదనుకున్న స్థానికులు… ఆ బాగోతాన్ని వీడియో తీశారు. ఆ తర్వాత.. పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. పాతిక మంది గుంపు తమ ఇంటి దగ్గర రేవ్ పార్టీ చేసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. ఎవరో అనుకుని వచ్చిన పోలీసులు… అక్కడున్న తమ అధికారిని చూసి షాకయ్యారు.

కొన్ని నెలల క్రితం పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లోనే పనిచేసిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు ఆక్కడ ఉన్నారు. మద్యం సేవించి అమ్మాయిలతో చిందులు వేస్తూ… కిక్కులో మునిగి తేలుతున్నారు. అతన్ని గుర్తించిన పోలీసులు.. సీఐ వెంకటేశ్వర్లును పక్కకు తప్పించి… మిగతా వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఐదుగురు మహిళలతో పాటు 20 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. 294 సెక్షన్ కింది కేసు నమోదు చేశారు. కానీ, ఏ సీఐ అయితే తమకు అండగా ఉంటానంటూ రేపు పార్టీ పెట్టించారో… ఇప్పుడు అదే సీఐని సైడ్ చేసేసి తమని కేసులో ఎలా ఇరికిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు రేవ్ పార్టీలో పాల్గొన్న కొంతమంది. సీఐని తప్పించడంపై లక్ష్మీపురం వాసులు కూడా మండిపడుతున్నారు. అసలు నిందితులను తప్పించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, రేవ్ పార్టీలో ఉన్న సీఐ వ్యవహారం మూడు వివాదాలు ఆరు ట్రాన్స్‌ఫర్లుగా కొనసాగుతోంది. గతంలో ఏసీబీలో పనిచేసిన సమయంలో వెంకటేశ్వర్లు అత్యంత వివాదాస్పద పేరు సంపాదించారు. అమాయకులను కేసులో ఇరికించారని, రిపోర్టులు రాసేందుకు లంచాలు తీసుకున్నట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అలాంటి సీఐ వెంకటేశ్వర్లు ఇప్పుడు రేవ్ పార్టీ లో దొరికి… అది జస్ట్ బర్త్‌డే పార్టీ విత్ ఆర్కెస్ట్రా అంటూ బుకాయిస్తున్నారని సమాచారం.

Also Read

  • Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
  • Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
  • Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్రం మెగా ప్లాన్..
  • Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Guntur District
  • police
  • Police Busted Rave Party
  • Rave Party

తాజావార్తలు

  • Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..

  • Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?

  • Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?

  • GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు..

  • Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్‌గా చేసేయండి!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions