పోలవరంపై నాలుగు రాష్ట్రాల భేటీ ముగిసింది. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పై అధ్యయనం చేయించామని కేంద్రం పేర్కొంది. నివేదిక ఆధారంగానే చర్యలని స్పష్టీకరించింది. ముంపు ప్రభావంపై సంయుక్త సర్వే చేపట్టేందుకు సహకరించాలని పీపీఏ ఛైర్మన్ పేర్కొన్నారు. పీపీఏ ఛైర్మన్ ప్రతిపాదనలకు ఏపీ, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ రాష్ట్రాల అంగీకారం తెలిపింది. అయితే, సంయుక్త సర్వేకు నో ఒడిశా ప్రభుత్వం అంగీకరించలేదు. మళ్లీ వచ్చే నెల ఏడో తేదీన సాంకేతిక నిపుణులతో మరో భేటీ నిర్వహించనుంది జలశక్తి మంత్రిత్వ శాఖ.
2009, 2011లలో పోలవరం బ్యాక్ వాటర్ పై శాస్త్రీయమైన సర్వేలు జరిగాయని వర్చువల్ సమావేశంలో కేంద్రజల శక్తి శాఖ తెలిపింది. ముంపు ప్రభావంపై ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలు అపోహలు పడుతున్నాయని కేంద్రం అభిప్రాయపడింది. భద్రాచలానికి ఎలాంటి ముంపు సమస్య లేదని స్పష్టం చేసింది కేంద్రం. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక కూడా మూడు రాష్ట్రాల్లో అడుగులో మూడో వంతు ముంపు ప్రభావం కూడా ఉండదని కేంద్ర జల సంఘం వెల్లడించింది. ముంపు ప్రభావం లేకుండా కరకట్ట కట్టేందుకు ఏపీ సిద్ధమైనా ఒడిశా ప్రజాభిప్రాయ సేకరణకు ముందుకు రాలేదని కేంద్రం తెలిపింది.
మరోమారు బ్యాక్ వాటర్ సర్వే చేయించాలని కోరింది తెలంగాణ. అయితే ఈ వాదనను తోసిపుచ్చింది కేంద్రం. గోదావరి ట్రిబ్యునల్ సిఫార్సుల మేరకు 36 లక్షల వరద జలాలు వెళ్లేలా స్పిల్ వే కట్టాలని ఉన్నా ప్రస్తుతం 50 లక్షల క్యూసెక్కుల వరద వెళ్లేలా ప్రాజెక్టు పూర్తి అవుతున్నట్టు పేర్కొంది కేంద్రం. బ్యాక్ వాటర్ సర్వేకు సంబంధించిన సాంకేతిక అంశాలపై మరో మారు భేటీ కావాలని నిర్ణయించింది. అక్టోబర్ 7వ తేదీన నాలుగు రాష్ట్రాల ఈఎన్సీలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది జలశక్తి శాఖ.
Read Also: Tollywood: రిలీజైన రెండోవారంలోనే ఓటీటీలో! ఇక థియేటర్ కెందుకొస్తారు!?