Vangalapudi Anitha : సంగం బ్యారేజ్‌కు పెద్ద ప్రమాదం తప్పింది.. అధికారులు చాకచక్యంగా రక్షించారు
- మొంథా తుఫాన్ ప్రభావంతో పెన్నా నదిలో ప్రమాద పరిస్థితి
- సంగం బ్యారేజ్ గేట్లకు అడ్డంగా పడిన భారీ బోటు
- ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సమిష్టి కృషితో బోటు వెలికితీత
- వేగవంతమైన చర్యలతో పెద్ద ప్రమాదం తప్పించుకున్న అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vangalapudi Anitha : మొంథా తుఫాన్ ప్రభావంతో పెన్నా నదిలో ఉధృతంగా పెరిగిన వరద ప్రవాహం నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజ్‌కు భారీ ప్రమాదం కలిగించే పరిస్థితి ఏర్పడింది. వరదలో కొట్టుకుపోయిన 30 టన్నుల భారీ బోటు బ్యారేజ్ గేట్లకు అడ్డంగా పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తక్షణ చర్యలు చేపట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
తుఫాన్ కారణంగా రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలు వాగులు, వంకలు పొంగిపొర్లేలా చేశాయి. పెన్నా నదిపై ఉన్న సంగం బ్యారేజ్‌కు లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. అదే సమయంలో భారీ బోటు ప్రవాహంలో కొట్టుకుపోయి బ్యారేజ్ వైపు చేరింది. అది గేట్లను తాకే పరిస్థితి వస్తే బ్యారేజ్‌కు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో అధికారులు వేగంగా చర్యలు చేపట్టారు.
Also Read
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్‌తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
సమాచారం అందుకున్న వెంటనే నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల సంఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షణ చేపట్టారు. వారి ఆధ్వర్యంలో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, కృష్ణపట్నం పోర్టు గస్తీ సిబ్బంది, పోలీసు విభాగం, వ్యవసాయ శాఖ అధికారులు సమిష్టిగా పని చేశారు. దాదాపు 100 మంది సిబ్బంది సహకారంతో ఆ బోటును విజయవంతంగా వెలికితీశారు.
మొత్తం 3.85 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణానికి ఆధారమైన సంగం బ్యారేజ్ ప్రమాదం నుంచి బయటపడడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. జిల్లా యంత్రాంగం సమయోచితంగా స్పందించిందని సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హోం మంత్రి వంగలపూడి అనిత కూడా అధికారులను అభినందిస్తూ, “ఆ బోటు అలాగే కిందకు వెళ్లి ఉంటే బ్యారేజ్ గేట్లను ఢీకొని భారీ నష్టం జరిగేదే,” అని పేర్కొన్నారు.
అధికారుల ప్రకారం, బిరపేరు, బోగ్గేరు వాగుల్లో అకస్మాత్తుగా నీటి మట్టం పెరగడంతో బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు సంగం బ్యారేజ్ వద్ద నీరు 11 అడుగులకు చేరుకుంది. ఈ వరద వేగం కారణంగా వంతెన రైలింగ్‌కు కట్టిన మూడు బోట్ల తాళ్లు తెగిపోయాయి. వాటిలో ఒకటి ఇసుక తిన్నెల్లో చిక్కుకోగా, మరోటి కనిగిరి రిజర్వాయర్ వైపుకు వెళ్లింది. మూడో బోటు మాత్రం బ్యారేజ్‌కు కేవలం 400 మీటర్ల దూరంలో నిలిచిపోవడంతో వెంటనే చర్యలు తీసుకుని రక్షించారు. అధికారుల చాకచక్యంతో నెల్లూరు సంగం బ్యారేజ్ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
USA: భారతీయులకు ట్రంప్ దెబ్బ.. ఈసారి H-1B హోల్డర్ల జీవిత భాగస్వాములే టార్గెట్..
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!