Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Vamsi: దసరా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం.47’ విడుదలపై గత కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. షూటింగ్ ఆలస్యం, పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల సినిమా అనుకున్న డేట్‌కి రాకపోవచ్చని, వాయిదా పడే ఛాన్స్ ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్వయంగా రంగంలోకి దిగి ఈ రూమర్లకు ఫుల్స్టాప్ పెట్టారు. సాధారణంగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించే చిత్రాల విడుదల తేదీలు తరచూ మారతాయనే ముద్ర సినీ వర్గాల్లో ఉంది. సరిగ్గా అదే అంశాన్ని నాగవంశీ చాలా ఓపెన్‌గా, సెటైరికల్‌గా ప్రస్తావించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. “మా బ్యానర్ మీద మీకు అలాంటి అనుమానాలు ఉండటం సహజమే.. కానీ ఈసారి మాత్రం ఏ డౌటూ అక్కర్లేదు. ‘ఆదర్శ కుటుంబం’ చెప్పిన సమయానికే వస్తుంది. అక్టోబరు 9న థియేటర్లలోకి దింపడం ఖాయం. ఇందులో ఎలాంటి మార్పూ లేదు” అంటూ కుండబద్దలు కొట్టారు. తన బ్యానర్ వీక్నెస్ను ఒప్పుకుంటూనే సినిమా రిలీజ్‌పై ఇచ్చిన ఈ బోల్డ్ క్లారిటీ నెట్టింట వైరల్ అవుతోంది.
సినిమా ప్రమోషన్స్, రిలీజ్ షెడ్యూల్‌ను కూడా ఆయన స్పష్టంగా వివరించారు. అక్టోబర్ 6వ తేదీన ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నట్లు, ఆ మరుసటి రోజు (అక్టోబర్ 7) నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ బుకింగ్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అంతేకాకుండా ఈ చిత్రానికి ఎలాంటి ముందస్తు ప్రీమియర్ షోలు వేయడం లేదని తేల్చిచెప్పారు. దసరా పండుగ సంబరాలను తమ సినిమాతోనే మొదలుపెట్టాలని ప్రేక్షకులకు పిలుపునిచ్చారు. వెంకటేశ్ పక్కన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించగా, నారా రోహిత్ ఓ కీలక పాత్రలో మెరవనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘నారాయణమ్మ’ పాట చార్ట్‌బస్టర్‌గా నిలవడంతో ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాపై అంచనాలు భారీగా పెరిగాయి. నిర్మాతే నేరుగా వచ్చి డేట్ మారదని స్పష్టం చేయడంతో వెంకీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
Also Read
- Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
- The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
- Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
- Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
Ma release punctuality meeda meeku doubt undachu, kani eesari alanti doubts em oddu 😄 #AdarshaKutumbam #AK47OnOCT9th
We are coming on 9th October. There is no change in that ❤️
6th – Trailer Launch
7th – Advance Bookings Open across both Telugu statesFamilies andaru mee…
— Naga Vamsi (@vamsi84) October 1, 2026
తాజావార్తలు
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
-
Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?