Pawan Kalyan: ఏపీలో జరుగుతున్న అరాచకాలను దుర్గమ్మ చూస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: విజయవాడలోని ఇంద్రకీలాద్రిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం ప్రత్యేకంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జనసేన ఎన్నికల ప్రచార రథం వారాహికి పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ ప్రచార రథంపై నుంచి జనసేనాని తొలిసారి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ సుభిక్షంగా ఉండాలని.. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి ముందుండాలని అమ్మవారిని కోరుకున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఏపీలో జరుగుతున్న అరాచకాలను దుర్గమ్మ చూస్తోందని పవన్ వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాలు ఐక్యతతో ఉండాలని, ఏపీలో రాక్షస పాలన అంతం కావాలని ఆకాంక్షించారు.
Read Also: Venky 75: ‘విక్రమ్’ రేంజులో ‘సైంధవ్’… వెంకీ మామ నెవర్ బిఫోర్
Also Read
ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రచార రథానికి పూజ చేసేందుకు ఇంద్రకీలాద్రికి వచ్చానని.. అమ్మవారి చల్లనిచూపు ప్రజలపై ఉంటుందని తెలిపారు. మంగళవాయిద్యాలే మనకు బలమన్నారు. ఇవాళ్టి నుంచి రాక్షస పాలనను అంతం చేయడమే వారాహి లక్ష్యమన్నారు. పుణ్యక్షేత్రం కాబట్టి ఇంతకుమించి మాట్లాడటం సరికాదన్నారు. కాగా దుర్గమ్మ దర్శనం కోసం ఆలయం లోపలకు వెళ్లిన పవన్ వెంట కొంతమంది ముఖ్యనేతలను మాత్రమే అధికారులు అనుమతించారు. జనసేనాని వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందిని కూడా లోపలకు అనుమతించలేదు. అటు పవన్ విజయవాడ రాక సందర్భంగా ఇంద్రకీలాద్రి, ఘాట్ రోడ్‌కు ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు తన అభిమానులకు వారాహి ఎక్కి పవన్ నమస్కారాలు తెలియజేశాడు.
తాజావార్తలు
-
JEE Advanced Result 2026: జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు రిలీజ్.. టాపర్ ఎవరంటే?
-
Virat Kohli : ఏకంగా 17 సార్లు…! రెండు సార్లు RCB కప్ కొట్టడానికి కారణం కోహ్లీనే.. ఈ లెక్కలే సాక్ష్యం భయ్యా!
-
Anushka Sharma: విరాట్ ఫినిష్ ఆఫ్ ఇట్స్ స్టైల్.. అనుష్క శర్మ రియాక్షన్ మాములుగా లేదుగా.!
-
Vaibhav Sooryavanshi: ఒకే ఒక్కడు.. బోలెడు రికార్డులు.. క్యూ కట్టిన అవార్డ్స్ ఇవే.!
-
Commercial LPG Price Hike: గ్యాస్ ధరల మంటలు .. భారీగా పెరిగిన వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!