Panchayati Funds: పంచాయతీ రాజ్ ఛాంబర్, సర్పంచ్‌ల ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను కలిశారు ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం ప్రతినిధులు. రూ. 7660 కోట్ల నిధులను పంచాయతీ ఖాతాల్లో నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుందని గవర్నరుకి ఫిర్యాదు చేశారు సర్పంచుల సంఘం. కేంద్ర ప్రభుత్వం 14,15వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు పంపించిన నిధులు రూ. 7660 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తన సొంత అవసరాలకు వాడుకుందంటూ గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళారు సర్పంచులు.
పంచాయతీ ఖాతాల్లోకి తిరిగి డబ్బు జమ చేయుంచాలని.. ఈ మేరకు గవర్నర్ జోక్యం కోరింది సర్పంచుల సంఘం. ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ వ్యవస్థాపక అధ్యక్షుడు వైబీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ గవర్నరుని కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేశామన్నారు. 14,15వ ఆర్ధిక సంఘం నిధులను కేంద్రం 2018 నుండి 2022వరకు రూ. 7660 కోట్ల నిధులు పంపింది. సర్పంచులకు చెప్పకుండా, ఆమోదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించింది.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
- Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
సీఎంఎఫ్ ఎకౌంటును దొంగిలించి సొంత పధకాలకు మళ్లించారు. ఈ విషయాలు తెలుసుకున్న గవర్నర్ కూడా ఆశ్చర్య పోయారు. 12,918పంచాయతీ నిధులు ఖాళీ చేయడంపై వివరాలడిగి తెలుసుకున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎలా తీసుకుంటుందని ఆయన ఎదురు ప్రశ్నించారు. ఇవ్వాల్సిన నిధులివ్వకపోగా… కేంద్రం నిధులు కూడా స్వాహా చేసింది. రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించిన ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పాం.
జగన్ ప్రభుత్వానికి బుద్ది చెప్పి.. మా నిధులు మాకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. అన్ని అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కోరాం.73,74 రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన నిధులును రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించింది. గ్రామాల అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం ఏమిటి..? సర్పంచుల ప్రమేయం లేకుండా అకౌంట్ల నుంచి ఎలా మళ్లిస్తారు..? ఇది దొంగతనం కాకపోతే ఎలా చూడాలి. ఇప్పటికే వివిధ రూపాలలో మా ఆవేదనను తెలిపాం. గవర్నరును ఇచ్చిన ఫిర్యాదుతో అయినా మా నిధులు మాకు వస్తాయని భావిస్తున్నాం అన్నారు సర్పంచ్‌లు. అప్పటికి స్పందన లేకపోతే రాష్ట్రపతిని కూడా కలిసి వివరిస్తాం. జగన్ ఇప్పుడైనా స్పందించి మా నిధులు మాకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!