Ambati Rambabu: పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం టీ. అన్నవరంలో టీడీపీ నేతల దాడిలో గాయపడి గుంటూరులో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్త వెంకటప్రసాద్ ను మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు పరామర్శించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాలో పోలీసులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.. రషీద్ ను చంపినట్టే వెంకట ప్రసాద్ ను హత్య చేసేందుకు తెలుగుదేశం నేతలు ప్రయత్నించారు.. చివరకు వెంకట ప్రసాద్ చనిపోయాడులే అని వదిలేసి వెళ్లిపోయారు.. పోలీసులు నేరస్తులతో కుమ్మక్కై బాధితుడిపైనే కేసు పెట్టారని ఆరోపించారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయవలసిన పోలీసులు చిన్న పెట్టి కేసు పెట్టారు.. ఈ కేసులో హత్యాయత్నం కేసుగా నమోదు చేయాలంటే ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠీని కలవాలి.. సర్వ శ్రేష్ట త్రిపాఠీని కలవాలంటే చంద్రబాబు, లోకేష్ ల వద్దకు వెళ్లాలి.. అప్పుడు కానీ ఐజి కలవరు.. పోలీసులు నేరస్తులతో కుమ్మకు అవ్వడం ఈ సమాజానికి ప్రమాదకరమని అంబాటి రాంబాబు పేర్కొన్నారు.
Read Also: Lord Ganesh: 4,000 మంది విద్యార్థులు, 5,000 దీపాలతో అద్భుతం.. వైరల్ వీడియో
మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. టి. అన్నవరం తెలుగుదేశం పార్టీకి రిగ్గింగ్ గ్రామం.. 2024 ఎన్నికల్లో వెంకట ప్రసాద్ వైసీపీ బూత్ ఏజెంట్ గా ఉన్నాడు.. వెంకట ప్రసాద్ బ్రతికి ఉంటే రాజకీయంగా తమకు ఇబ్బంది అవుతుందని టీడీపీ నాయకులు భావించారు.. కొన్నాళ్లుగా వెంకట ప్రసాద్ ను చంపాలని కుట్రపన్నారు.. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రోద్బలంతోనే వెంకట ప్రసాద్ పై దాడి జరిగింది.. చావు బ్రతుకుల మధ్య వెంకట ప్రసాద్ ఉంటే పోలీసులు ఆయనపైనే కేసు పెట్టారు.. ఇదేం పోలీస్ వ్యవస్థ అని ప్రశ్నించారు.వెంకట ప్రసాద్ పై పోలీసులు పెట్టిన కేసుపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.