తప్పుడు విచారణలను పోలీసులు మానుకోవాలి.. జోగి రమేష్ పై చంద్రబాబు, లోకేష్ కు కక్ష ఉంది.. ఎదో ఒక కేసు పెట్టి అరెస్టు చేయించాలని ప్రయత్నించారు.. దోషులు కానీ వారిని దోషులుగా చిత్రీకరించేందుకు తప్పుడు స్టేట్మెంట్లు తీసుకునే ప్రయత్నం దుర్మార్గం.. పోలీసులే దౌర్జన్యం చేసి తప్పుడు స్టేట్మెంట్లపై సంతకాలు తీసుకోవాలని చూస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు.
అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాలో పోలీసులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.. రషీద్ ను చంపినట్టే వెంకట ప్రసాద్ ను హత్య చేసేందుకు తెలుగుదేశం నేతలు ప్రయత్నించారు.. చివరకు వెంకట ప్రసాద్ చనిపోయాడులే అని వదిలేసి వెళ్లిపోయారు.. పోలీసులు నేరస్తులతో కుమ్మక్కై బాధితుడిపైనే కేసు పెట్టారని ఆరోపించారు.