Site icon NTV Telugu

Mudragada Padmanabham: అంబటి రాంబాబు ఇంటిపై దాడిని ఖండించిన ముద్రగడ..

Mudragada

Mudragada

Mudragada Padmanabham: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిని ముద్రగడ పద్మనాభం తీవ్రంగా ఖండించారు. కూటమి పాలనలో వైసీపీ నేతలను టార్గాట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భగా అంబటి కుమార్తె ఫైర్ బ్రాండ్ మౌనికను పలకరించడానికి వచ్చాను.. భవిష్యత్తులో మమతా బెనర్జీ స్థాయికి వెళ్లాలి.. మాజీ మంత్రి ఇంటిపై దాడి బాధాకరం అన్నారు. రెండు సార్లు కాపుల సాయంతో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.. చంద్రబాబు నన్ను, నా కుటుంబాన్ని వేధించారు.. మాకు జరిగిన అవమానాలు మీకు మీ భార్య, కొడుకు, కోడలుకు జరిగితే ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు. మేం బానిసలం కాదు అని ముద్రగడ అన్నారు.

Read Also: MLC Anantha Babu: నా భార్యను అన్యాయంగా కేసులో ఇరికించారు

అయితే, తిరుమల లడ్డుపై ఈ కూటమి ప్రభుత్వం రోజూ అబద్దాలు ఆడుతుందని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం విమర్శలు గుప్పించారు. మీ అబద్దాలను ఇకనైనా ఆపి వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పండి అని సూచించారు. క్షమాపణ లేకపోయినా ఫరవాలేదు.. అసలు లడ్డూ గురించి మాట్లాడడం ఆపేయండి అని సూచించారు. ఇంతకీ మీ ఉద్దేశం ఏంటి, అందరినీ జైలులో పెట్టాలనా.. అని అడిగారు. ప్రజలు మీకు ‌అవకాశం ఇచ్చారు.. దాన్ని సద్వినియోగం చేసుకోండి అని సలహా ఇచ్చారు. ఇకనైనా మా ఇళ్లపై దాడిచేసే కార్యక్రమాలకు స్వస్తి పలకండి అని పద్మనాభం వెల్లడించారు.

Exit mobile version