Dr. Sankurathri Chandra Sekhar : పద్మశ్రీతో నా బాధ్యత మరింత పెరిగింది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dr. Sankurathri Chandra Sekhar : తనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చే శారు డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పద్మశ్రీ రావడం నా బాధ్యతను మరింత పెంచిందన్నారు.. ఎప్పుడూ గుర్తింపు కోసం పనిచేయలేదు, సమాజానికి నేను ఏమి ఇవ్వగలనని అని మాత్రమే ఆలోచించానని వెల్లడించారు.. నా కుటుంబాన్ని కోల్పోయినప్పుడు పేదలకు నా వంతు సాయం చేయాలని ఆలోచించాని పాత రోజులను గుర్తుచేసుకున్న ఆయన.. నా టీం సభ్యుల కృషి వలన ఇదంతా సాధ్యమైందన్నారు.. నాలుగు దశాబ్దాలుగా విద్య, వైద్యం, కళా రంగంలో నాకు అవకాశమున్న మేర పని చేస్తూనే ఉన్నారు.. అవార్డుల కోసం ఎప్పుడూ ఆలోచించలేదు, ఆలస్యమైందని అనుకోవడం లేదు.. ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు అని తెలిపారు.. ఇక, నా భార్య పిల్లలను కోల్పోయిన క్షణం ఎప్పటికీ మర్చిపోలేనన్న ఆయన.. వాళ్ల గుర్తుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాని తెలిపారు..
Read Also: PM Narendra Modi: భారతీయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
Also Read
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
కాగా, డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్‌కు ‘పద్మశ్రీ’ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం… చంద్రశేఖర్ 1943 నవంబరు 20న జన్మించారు. రాజమహేంద్రవరం, విశాఖ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఆయన విద్యాభాసం సాగింది. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లారు. బయాలజీ చదువుకున్న ఆయన సైంటిస్ట్‌గా అక్కడే స్థిరపడ్డారు. అయితే, కాకినాడకు చెందిన మంజరిని 1975 మేలో వివాహం చేసుకున్నారు. వీరికి శ్రీకిరణ్ (6), శారదా(3) అనే ఇద్దరు పిల్లలు. భార్యా పిల్లలను కెనడా నుంచి స్వదేశానికి పంపించేందుకు… 1985 జూన్ 23న ‘కనిష్క’ విమానం ఎక్కించి వీడ్కోలు పలికారు. కానీ… ఆ విమానాన్ని ఖలిస్థాన్ ఉగ్రవాదులు పేల్చేయడంతో.. ఆయన జీవితం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది.. అక్కడే ఆయన ఆలోచనలకు అడుగులు పడ్డాయి.. తన శక్తి మేర సేవ చేయాలనుకున్నారు.. పేదలకు సేవ చేస్తూ ఆ తృప్తి, ఆనందంలోనే తన భార్యా పిల్లలను వెతుక్కోవాలని నిర్ణయించుకున్న ఆయన.. కాకినాడలో అడుగుపెట్టి కొత్త జీవితం మొదలుపెట్టారు. కెనడాలోని తన ఆస్తిపాస్తులన్నీ విక్రయించి… స్వదేశానికి తిరిగి వచ్చారు. కుమారుడు కిరణ్ పేరుతో కంటి ఆస్పత్రి స్థాపించారు. 1993 నుంచి ఇప్పటి దాకా 3.40లక్షల మంది పేదలకు 90శాతం ఉచితంగా కేటరాక్ట్ ఆపరేషన్‌లు చేయించారు. మరో 38లక్షలమందికి అవుట్ పేషెంట్ విభాగంలో వైద్యం అందించిన గనత ఆయనకే దక్కింది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్‌లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!