Online Frauds: ఆన్ లైన్ కేటుగాళ్ళు.. ఆదమరిస్తే అంతే సంగతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అవకాశం వచ్చిందంటే చాలు తమ మాయాజాలం ప్రజలపై ప్రదర్శిస్తూ అకౌంట్లో డబ్బులు కొట్టేస్తున్నారు. ఒకప్పుడు ఏటీఎం సెంటర్లలో జనం రద్దీగా ఉండే సెంటర్లలో మాత్రమే జరిగే అకౌంట్ చోరీలు ఇప్పుడు నెట్ ఫోన్ల పుణ్యమా అని నేరుగా మన వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చి అకౌంట్లో సొమ్ము ఖాళీ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు….. గుంటూరు జిల్లాలో తాజాగా జరుగుతున్న అనేక ఘటనలు నష్టాల పాలు చేస్తున్నాయి.
మీ ఆయనకు ఆరోగ్యం బాగా లేదు కదా మీకు సీఎం ఆఫీస్ నుండి లక్ష రూపాయలు శాంక్షన్ అయ్యాయి మీ అకౌంట్ నెంబర్ చెప్పండి అందులో మినిమం ఓ పది వేలు ఉంచండి ఆతరువాత లక్ష రూపాయలు మీవే అంటూ మాయగాళ్ళు విసిరిన వలకు అకౌంట్లో సొమ్ము ఖాళీ చేసుకుంది ఓ మహిళ …గుంటూరు జిల్లా బొర్రా వారి పాలెం నుండి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు…
Also Read
- Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
- Ganesh Idol Protest: 'వినాయకుడి'తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
మనిషి వ్యక్తిగత సమాచారం, అవసరాలు తెలుసుకుని, మీకు ఆరోగ్యశ్రీ అమౌంట్ వచ్చింది, ఈ రోజు తో ఆఖరు ..మీ అకౌంట్ నంబర్ చెప్తే అమౌంట్ వేస్తాం లేదంటే మీ ఇష్టం అంటూ ఒక మహిళ ను నమ్మిచడం ఆతరువాత ఆమె ద్వారా మరో మహిళ అకౌంట్ లో ఆమె అన్న అకౌంట్ లో డబ్బును క్షణాల్లో కొట్టేసిన వ్యవహారం కొత్త మళ్ళాయి పాలెం లో జరిగింది. ఇవే కాదు మీరు మా దగ్గర అప్పు తీసుకున్నారు ఆ అప్పు చెల్లించకపోతే మీపై తప్పుడు ప్రచారం చేస్తాం అసభ్య ఫోటోలు పెట్టి మీ పరువు తీసేస్తా అంటూ మెసేజ్.
మీరు ఇంట్లోనే ఉండి రోజుకి వేలకు వేలు సంపాదించవచ్చు వర్క్ ఫo హోం ద్వారా రోజుకు ఐదు వేల ఆదాయం అంటూ మెసేజ్ లు. మీరు మొబైల్ ఫోన్ లో యూట్యూబ్ లింకులు ఓపెన్ చేస్తే నెలకు 40వేల జీతం అంటూ నమ్మబలికి తీయటి మాటలు చెప్పి అమాయకుల వద్ద లక్షల్లో కాజేస్తున్నారు కేటుగాళ్లు. మరోవైపు బ్యాంకు ఓటీపీల పేరుతో జరుగుతున్న ఆన్లైన్ నిలువు దోపిడీ తో ప్రజలు ఫోన్ పట్టుకోవాలంటేనే వణికిపోయే పరిస్థితి. ఇతర రాష్ట్రాల నుండి చక్కటి తెలుగు భాషలో మాట్లాడి అమాయకులను బుట్టలో పడేస్తున్నారు సైబర్ దొంగలు. షాపింగ్ మాల్స్ ఇతర బహిరంగ ప్రదేశాల్లో మీ వ్యక్తిగత సమాచారం ఇతరులతో షేర్ చేయొద్దు అంటున్నారు పోలీసులు. అనుమానితులు అపరిచిత వ్యక్తులు ఫోన్ నెంబరు ఇవ్వవద్దంటున్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!