ఏపీ ఉద్యోగులకు షాక్.. రేపు సెలవు ఇవ్వొద్దని ప్రభుత్వం ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య పీఆర్సీ రగడ కొనసాగుతోంది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులు తలపెట్టిన ‘చలో విజయవాడ’ నేపథ్యంలో సర్కారు అప్రమత్తమైంది. గురువారం నాడు అత్యవసరమైతే తప్ప ఉద్యోగులకు సెలవు ఇవ్వవద్దని అధికారులకు జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చాలా మంది విజయవాడకు చేరుకున్నారు. ఉద్యోగ సంఘాల నేతలను హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Read Also: రేపు ఉద్యోగ సంఘాలు చేసేది బలప్రదర్శనే: సజ్జల
Also Read
అయితే ఉద్యోగులందరినీ అరెస్ట్ చేసినా 10 మందితో అయినా ఛలో విజయవాడ నిర్వహించి తీరుతామని పీఆర్సీ సాధనసమితి నేత బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అంతకుముందు విజయవాడ సీపీ కాంతిరాణా టాటాను కలిసేందుకు వెళ్లిన పీఆర్సీ సాధన సమితి నేతలకు చుక్కెదురైంది. ఛలో విజయవాడ కార్యక్రమానికి అనుమతివ్వాలని కోరడానికి విజయవాడ సీపీ కార్యాలయానికి పీఆర్సీ సాధన సమితి నేతలు వెళ్లగా.. వారితో మాట్లాడి ఏడీసీపీ రమణమూర్తి వెనక్కి పంపేశారు. అయితే తాము సీపీని కలవడానికి రాలేదని… ఇప్పటివరకు తమకు సహకారం అందించినందుకు ధన్యవాదాలు తెలపడానికి వచ్చామని పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి సూర్యనారాయణ తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా విజయవాడ సీపీ సహకారం అందించలేకున్నా.. ఆయన మనస్సు తమతోనే ఉందన్నారు.
తాజావార్తలు
-
Twisha Sharma: ‘అవి మాకు పూర్తిగా కావాలి’.. కోర్టులో ట్విషా శర్మ అత్తగారు వింత వాదన
-
Womens T20 World Cup: పాకిస్థాన్‌పై కొట్టడం అంటే ఆ మజానే వేరు.. ఫామ్‌లోకి వచ్చిన రిచా ఘోష్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి ఎందుకంత భయపడుతున్నారు?
-
US Plane Crash: అమెరికా విమాన ప్రమాదం.. తెలుగు యువకుడు మృతి
-
Karan Johar: చివరికి మలయాళ దర్శకుడిని నమ్ముకున్న కరణ్ జోహార్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?