NIA Raids in Guntur and Kurnool: గుంటూరు, కర్నూలులో ముగిసిన NIA సోదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, కర్నూలులో NIA అధికారులు తనిఖీలు నిర్వహించారు. గుంటూరులో NIA అధికారుల సోదాలు ముగిశాయి. మొత్తం ఏడు గంటల పాటు సోదాలు చేశాయి NIA బృందాలు…మూడు బృందాలతోపాటు డీఐజీ స్థాయి అధికారి ఈ సోదాల్లో పాల్గొన్నట్లు సమాచారం…PFI, SDPIకి చెందిన ముగ్గురు కీలక అనుమానితులని అదుపులోకి తీసుకున్నాయి ఎన్ఐఏ బృందాలు…మొత్తం ఏడు గంటల పాటు సోదాలు చేయడంతో ఏం జరుగుతుందో తెలీక స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
Read Also: Adani, Reliance Pact: ఆ ఇంటి మీది కాకి ఈ ఇంటి మీద.. ఈ ఇంటి మీది కాకి ఆ ఇంటి మీద వాలటానికి వీల్లేదు
Also Read
ముఖ్యనేతల కార్యాలయాలు, ఇళ్లపై సోదాలు కొనసాగాయి. గుంటూరు జిల్లాలో అర్ధరాత్రి నుంచి అధికారులు సోదాలు నిర్వహించగా… పాత గుంటూరులోని పలు ప్రాంతాలలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. వహీద్, రహీమ్, జఫ్రుల్లా ఖాన్ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు NIA అధికారులు. వచ్చేనెల 8న విచారణకు హాజరుకావాలంటూ PFI సభ్యులకు ఎన్.ఐ.ఏ. అధికారులు నోటీసులు జారీచేశారు.
కరాటే శిక్షణ పేరుతో పీఎఫ్‌ఐ సంస్థ ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందించడంతో పాటు యువతకు ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు వచ్చిన ఆరోపణలతో ఈ సోదాలు జరిగాయి. గుంటూరుతో పాటు కర్నూలులోని ఖడక్‌పూర్ వీధిలో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. ఎస్‌డీపీఐ నాయకుడి ఇంట్లో సోదాలు నిర్వహించి కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.ఇదిలా వుంటే కర్నూలులో NIA దాడులకు నిరసనగా గాంధీ విగ్రహం ముందు SDPI ఆందోళనకు దిగింది.ఎస్డీ పి ఐ నేతలు అబ్దుల్ వారిస్, ఇంతియాజ్ ఇళ్లలో సోదాలు చేయడంతో ఎన్ ఐ ఏ అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. ఎన్ ఐ ఏ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏమీ దొరకకపోవడంతో వెనుదిరిగివెళ్లిపోయారు ఎన్ ఐ ఏ అధికారులు. టు టౌన్ పీఎస్ కు చేరుకున్నారు ఎన్ ఐ ఏ అధికారులు.
Read Also: Theft in Bajaj Showroom: ఎలక్ట్రానిక్స్ షోరూంలో దొంగ దర్జా.. తాపీగా లక్షలు దోచుకెళ్ళిన కేటుగాడు
తాజావార్తలు
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
-
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
-
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!