విశాఖలోని రుషికొండ తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు రుషికొండలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టవద్దని ఆదేశాలు జారీచేసింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఎన్జీటీ ఈ ఆదేశాలిచ్చింది. ఇప్పటివరకు జరిగిన తవ్వకాలపై అధ్యయనానికి సంయుక్త కమిటీని నియమించింది. దీనికి సంబంధించి నోడల్ ఏజెన్సీగా ఏపీ కోస్టల్ మేనేజ్‌మెంట్ అథారిటీని నియామకం చేసింది ఎన్జీటీ. నెల రోజుల్లో కమిటీ నివేదిక అందించాలని ఎన్జీటీ ఆదేశాలు…