Girl Attacked Father: తండ్రిపై దాడి చేసిన బాలిక కేసులో ట్విస్ట్.. అసలు విషయం ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Girl Attacked Father: విశాఖలో నిద్రపోతున్న తండ్రి పై దాడికి పాల్పడిన మైనర్ బాలిక కేసులో అనూహ్య మలుపు తిరిగింది. ప్రేమ పేరిట యువకుడు కుటుంబం బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడడం వల్లే ఈ తప్పు పని చేసినట్టు ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.. విశాఖలోని అక్కయ్యపాలెంకి చెందిన బాలిక ఇంటర్మీడియట్ చదువుతుంది.. అయితే, అదే ప్రాంతానికి చెందిన బాలుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది.. అయితే ఆమె కుటుంబ సభ్యులకు తెలియకుండానే దాదాపు రెండు లక్షల రూపాయల నగదు… 8 తులాల బంగారం.. కొంత వెండి ఆభరణాలు ఆ బాలుడు కుటుంబానికి ఇచ్చింది బాలిక.. ఈ విషయం తెలిసిన తండ్రి ప్రశ్నించడంతో ఆమె ఓ రోజు నిద్రపోతున్న తండ్రిని చాకుతో పొడిచింది. కానీ, ఆఖరి నిమిషంలో తండ్రి మేలుకోనడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు..
Read ALso: IAS Officer Case Update: అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ ఇంటికి.. డిప్యూటీ తహశీల్దార్ పై వేటు
Also Read
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
- TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
- AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
ఇక, ప్రేమికుని వలలో పడి ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తొలి దశలో పోలీసులు భావించారు. కానీ, ఆ బాలుడు కుటుంబ సభ్యులు తన మార్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి తన తండ్రిని, తమ్ముడిని కడ తేర్చమని చెప్పడంతోనే.. ఈ తరహాలో ప్రవర్తించినట్లు ఆ బాలిక పోర్త్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇరు కుటుంబాలను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.. తన తండ్రిపై దాడికి పాల్పడినట్లు కూడా తనకు తెలియకుండానే ఈ ఘటన జరిగిపోయిందని సదరు బాలిక ఆవేదన వ్యక్తం చేసింది.. ప్రియుని కుటుంబం ట్రాప్ చెయ్యడం వలనే తండ్రి పై దాడి చేసినట్టు చెబుతున్న మైనర్ బాలిక.. తన ప్రియుడికి గతంలో కూడా ఇతర యువతులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతోంది.. ప్రేమ పేరిట మోసం చేసి తమ డబ్బు, నగదు దోచుకున్నారని.. ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామంటూ బ్లాక్ మెయిల్ చేశారని కన్నీరుమున్నీరవుతోంది.
కాగా, బాలిక తండ్రిపై కత్తి దాడికి పాల్పడింది. బాలిక కత్తితో తండ్రి మెడపై పొడిచింది. ప్రియుడి మోజులో పడిన బాలిక తన ఇంట్లో ఉన్న రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలను ఆ యువకుడికి ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తండ్రి కూతురిని నిలదీశాడు. ఇంట్లో కొన్ని రోజులుగా తండ్రి, కూతురు మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఈ విషయాన్ని బాలిక ఆమె ప్రియుడికి చెప్పింది. తన దగ్గర డబ్బులు లేవని నీవే ఏదో ఒకటి చేయాలని యువకుడు చేతులెత్తేశాడు. దీంతో బాలిక కత్తితో కన్న తండ్రిపై దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన తండ్రి స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు బాలికను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ యువకుడికి మరొకరితో ప్రేమ వ్యవహారం నడుస్తోందని బాలిక బంధువులు పేర్కొన్నారు. ఆమె ప్రోద్బలంతోనే డబ్బు కాజేశారని ఆరోపిస్తున్నారు. మొత్తంగా ఈ వ్యహారంలో విశాఖలో సంచలనంగా మారింది.
తాజావార్తలు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
-
Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
-
Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
-
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..