Kodali Nani: సుదీర్ఘ విరామం తర్వాత.. క్రియశీల గుడివాడ రాజకీయాల్లో మాజీమంత్రి కొడాలి నాని ప్రత్యక్షమైయ్యారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమంలో మొదటిసారి పాల్గొన్నారు. ఎన్నికల్లో ఓటమి, అనారోగ్య సమస్యలతో 18 నెలలుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు కొడాలి నాని. ఇక, గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అందించే వినతి పత్రంలో సంతకం చేశారు. వినతి పత్రాలను జిల్లా కమిటీకి అందించే పార్టీ శ్రేణుల ర్యాలీకి జెండా ఊపి కొడాలి నాని ప్రారంభించారు.
Read Also: Indigo Crisis: ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం.. ఇలా ఎందుకు జరిగిందని కేంద్రానికి ప్రశ్న
ఈ సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నాని పార్టీ శ్రేణులతో ఉత్సాహంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు వైద్య- విద్య అందాలనే మంచి సంకల్పంతో.. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలో ఏర్పాటుకు పునుకున్నారు.. తమ పాలనలో ఐదు కళాశాలలు పూర్తి చేయగా.. మరో ఐదు కళాశాలల నిర్మాణం తుది దశకు చేరుకున్నాయి.. పేద ప్రజలు, విద్యార్థులకు ఉపయోగపడే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, హాస్పిటల్స్ ప్రైవేటీకరణ దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. కూటమి ప్రభుత్వ కుట్రను అడ్డుకునేందుకు మాజీ సీఎం జగన్ ప్రజలతో కలిసి పోరాటాన్ని మొదలు పెట్టారని పేర్కొన్నారు. తాము తలపెట్టిన ఉద్యమానికి ప్రజల నుంచి చక్కటి స్పందన వచ్చింది.. ప్రజల విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.. ప్రజాభిష్టానికి అనుకూలంగా వ్యవహరించాలని కేంద్రాన్ని కోరుతాము.. ఉద్యమంలో తాము సేకరించిన పత్రాలను.. వైసీపీ అధినేత జగన్ నాయకత్వంలో గవర్నర్ కు అందిస్తామని కొడాలి నాని వెల్లడించారు.
