Nara Lokesh: ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల కోసం ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి ని రంగంలోకి దింపి ప్రచారాన్ని హోరెత్తించాడు. ఇక మరోపక్క టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. జనవరి 27 నుంచి ఏ ఈపాదయాత్ర మొదలుకానున్నట్లు తెలుస్తోంది. పాదయాత్రకు రెండు రోజులు మాత్రమే ఉండడంతో నారాలోకేష్ నేడు ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి ఎన్టీఆర్ ఆశీర్వదాలు అందుకున్నాడు. ఇది ఆ తరువాత నారా- నందమూరి కుటుంబాలు కలిసి ఇంట్లో పూజలు జరిపించారు. ఈ పూజ అనంతరం నారా లోకేష్ పెద్దల ఆశీర్వాదాలు అందుకున్నాడు.
Read Also: Ambati Rambabu: పవన్ ఎంటర్ టైనర్ మాత్రమే.. జగన్ జనం మనసు గెలిచిన ధీరుడు
తండ్రి నారా చంద్రబాబు నాయుడు, మామ నందమూరి బాలకృష్ణ కాళ్లకు మొక్కి లోకేష్ ఆశీర్వదాలు అందుకున్నాడు. ఇక లోకేష్ భార్య నారా బ్రాహ్మణి.. భర్తకు బొట్టుపెట్టి పాదయాత్రకు పంపింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. జనవరి 26 ఉదయం 10.30 గంటలకు తిరుమల నుంచి బయల్దేరి రోడ్డు మార్గంలో కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు లోకేష్ చేరుకుంటాడు. అక్కడ కుటుంబ సభ్యుల నడుమ లోకేష్ యువగళం పాదయాత్రను మొదలుపెట్టనుంది. మరి ఈ పాదయాత్ర లోకేష్ కు ఏ రేంజ్ లో ఉపయోగపడుతుందో చూడాలి.
Read Also: Lucknow Building Collapse: లక్నోలో కూలిన భవనం.. ఎస్‌పీ నేత తల్లి, భార్య దుర్మరణం