Nara Lokesh : క్షమాపణలు చెబితేనే.. సమావేశాలకు వెళ్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ అసెంబ్లీ సమావేశాల నుంచి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలో అడుగుపెడుతానని శపథం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 7 నుంచి మొదలు కానున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా? వద్దా? అన్న విషయంపై టీడీపీలో పెద్ద చర్చే నడుస్తోంది. ఇప్పటికే గురువారం మధ్యాహ్నం అమరావతిలో భేటీ అయిన టీడీపీ అత్యున్నత నిర్ణాయక విభాగం పొలిట్ బ్యూరోలో ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది.
చంద్రబాబు భార్యపై మంత్రులు దారుణ వ్యాఖ్యలు చేశారని, వారు బేషరతుగా క్షమాపణలు చెప్పేదాకా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లరాదని పొలిట్ బ్యూరోలోని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. మంత్రులు క్షమాపణలు చెప్పకపోతే ఎలాంటి వ్యూహం అవలంబించాలన్న దానిపై పొలిట్ బ్యూరోలో ఎలాంటి ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదట. దీంతో దీనిపై టీడీపీఎల్పీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. తాజాగా ఈ అంశంపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎమ్మెల్సీ నారా లోకేశ్ మాట్లాడారు. తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులు బేషరతుగా క్షమాపణలు చెబితే సమావేశాలకు వెళ్లాలన్న పొలిట్ బ్యూరో నిర్ణయం సరైనదేనని ఆయన వ్యాఖ్యానించారు. అయితే రాష్ట్ర ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని.. ఆ సమస్యలపై చర్చించేందుకు, సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ వైఖరిని నిలదీసేందుకు అవకాశం ఉన్న అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకపోతే బాగోదేమోనన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు.
Also Read
- ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
- Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
ఈ క్రమంలో త్వరలో జరగనున్న టీడీఎల్పీ భేటీలో ఈ విషయంపై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని లోకేశ్ చెప్పారు. అయితే తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులు బేషరతుగా క్షమాపణలు చెబితే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే విషయంపై ఇక ఎలాంటి చర్చ లేకుండానే సభలో అడుగుపెడతామని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
-
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
-
Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!