మరోసారి వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు, పోలీసులు, వాలంటీర్లు చేస్తున్న అరాచకాల నుంచి రక్షించే యాప్ ఏదైనా వుంటే ఆరంభించండి సీఎం సారూ! అంటూ సీఎం జగన్‌పై నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాకుండా కర్నూలు జిల్లా గూడూరు మండలం గుడిపాడులో మహిళా పోలీసుల అమానవీయ ప్రవర్తనతో సభ్యసమాజం తల దించుకుందని ఆయన ఆరోపించారు. తన ఇంటి ముందు స్థలాన్ని పోలీసులతో వచ్చిన రెవెన్యూ సిబ్బంది…
గత అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ అసెంబ్లీ సమావేశాల నుంచి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలో అడుగుపెడుతానని శపథం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 7 నుంచి మొదలు కానున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా? వద్దా? అన్న విషయంపై టీడీపీలో పెద్ద చర్చే నడుస్తోంది. ఇప్పటికే గురువారం మధ్యాహ్నం…