Allagadda: ఎస్ఐ వేధింపులు భరించలేక డ్రైవర్ ఆత్మహత్యాయత్నం..
- నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డలో దారుణం..
- ట్రాక్టర్ డ్రైవర్‌ను డబ్బుల కోసం వేధించిన ఎస్ఐ..
- ఎస్ఐ వేధింపుల భరించలేక ఆత్మహత్యయాత్నం చేసుకున్న డ్రైవర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allagadda: నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డలో దారుణం చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ రూరల్ ఎస్ఐ వేధింపులు భరించలేక ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సెల్ఫీ తీసుకొని ఆత్మహత్యయత్నం చేసుకున్న డ్రైవర్.. చాగలమర్రి టోల్ గేట్ దగ్గర ఇసుక ట్రాక్టర్ ను పట్టుకుని స్టేషన్ కు ఆళ్లగడ్డ రూరల్ ఎస్ఐ హరిప్రసాద్ తరలించాడు. ఈ సందర్భంగా 20 వేల రూపాయలు ఇవ్వాలని ట్రాక్టర్ డ్రైవర్ రవీంద్ర ను ఎస్ఐ వేధించాడు. అయితే, రూ. 10 వేలు ఫోన్ పే ద్వారా పంపిన ట్రాక్టర్ డ్రైవర్.. మిగతా డబ్బులు ఇవ్వలేదని రవీంద్రను రూరల్ ఎస్ఐ హరి ప్రసాద్ వేధించాడు. దీంతో చేసేది లేక చెన్నంరాజు పల్లెకు చెందిన ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ ఎన్ రవీంద్ర విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ట్రాక్టర్ డ్రైవర్ ను పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ రవీంద్ర పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక, ఆళ్లగడ్డ రూరల్ ఎస్ఐ హరి ప్రసాద్ పై వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు నజర్ పెట్టారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Also Read
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- Srisailam Water Release: గుడ్‌న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- NIA: నంద్యాలలో ఎన్ఐఏ విచారణ.. కేరళ ఎన్కౌంటర్ తర్వాత మరో ట్విస్ట్.. మవోయిస్టు జయమ్మ జీవించి ఉందా..?
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!