Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam Temple: సోమవారం శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది.. అది శ్రావణమాసం అయితే.. మరి ఎక్కువ.. ఇక, శ్రావణమాసం ముగింపునకు వస్తుందంటే.. రద్దీ మరింత పెరుగుతుంది.. శ్రావణమాసం ముగింపు దశకు చేరుకోవడంతో శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా నేడు శ్రావణ సోమవారం కావడంతో తెల్లవారుజామున నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా శ్రీశైలం క్షేత్రానికి తరలివచ్చారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
నిన్న ఒక్కరోజే శ్రీ స్వామి, అమ్మవార్లను 42,078 మంది భక్తులు దర్శించుకున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. నేడు కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో దర్శనానికి రద్దీ పెరిగింది. క్యూలైన్లు, క్యూ కాంప్లెక్స్‌లలో భక్తులు బారులు తీరారు. భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పించేందుకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రద్దీ నేపథ్యంలో అభిషేకం, స్పర్శ దర్శనం, కుంకుమార్చన సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు.
Also Read
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- Srisailam Water Release: గుడ్‌న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- NIA: నంద్యాలలో ఎన్ఐఏ విచారణ.. కేరళ ఎన్కౌంటర్ తర్వాత మరో ట్విస్ట్.. మవోయిస్టు జయమ్మ జీవించి ఉందా..?
ప్రస్తుతం శ్రీ స్వామి, అమ్మవార్ల దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రొటోకాల్ సిఫార్సులతో వచ్చే భక్తులకు మాత్రం రాత్రి 8.30 గంటలకు స్పర్శ దర్శనం కల్పించనున్నట్లు దేవస్థానం వెల్లడించింది. శ్రీశైలంలో జరుగుతున్న శ్రావణ మాసోత్సవాలు మరో ఐదు రోజుల్లో ముగియనున్నాయి. దీంతో మిగిలిన రోజుల్లోనూ భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
తాజావార్తలు
-
Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Lemon Prices Surge in Hyderabad: నిమ్మకాయ ధరలకు రెక్కలు.. చికెన్‌తో పోటీ పడుతున్న ధరలు
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
Ameesha Patel: ‘ఆంటీ’ అంటూ ట్రోల్.. హార్దిక్‌తో లింకప్ రూమర్స్‌పై అమీషా స్ట్రాంగ్ కౌంటర్!
-
TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
ట్రెండింగ్
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!