Srisailam Dam: మరోసారి శ్రీశైలం గేట్లు ఎత్తిన అధికారులు.. ఈ ఏడాది ఐదోసారి..
- మరోసారి శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత..
- 1 రేడియల్ క్రెస్టు గేటు 10 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటి విడుదల..
- ఈ ఏడాదిలో ఐదో సారి డ్యామ్ గేట్లు ఎత్తిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam Dam: కృష్ణా నదిలో మరోసారి వరద ఉధృతి పెరిగింది.. ఇప్పటికే జూరాలలో గేట్లు ఎత్తడంతో.. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పెరిగింది.. దీంతో.. శ్రీశైలం జలాశయం గేటును ఎత్తారు అధికారులు.. ఈ సంవత్సరంలో ఇది ఐదోవసారి రేడియల్ క్రెస్టు గేట్ ఎత్తడం విశేషంగా చెప్పుకోవాలి.. జలాశయం 1 రేడియల్ క్రెస్టు గేటు 10 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇన్ ఫ్లో రూపంలో 93,270 క్యూసెక్కుల నీరు వచ్చి శ్రీశైలం డ్యామ్‌లో చేరుతుండగా.. 1 గేటు 10 అడుగుల మేర ఎత్తి 95,626 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.. ఇక, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.50 అడుగులుగా ఉంది.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు అయితే.. ప్రస్తుతం ప్రాజెక్టులో 212.9198 టీఎంసీలు నీరు నిల్వ ఉంచారు.. మరోవైపు.. కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది..
Read Also: Putin Health Rumours: రష్యా అధ్యక్షుడికి అనారోగ్యమని ప్రచారం.. ఖండించిన క్రెమ్లిన్
Also Read
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
ఇక, జూరాలకు వరద ఉదృతి కొనసాగుతోంది.. దీంతో 11 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇన్ ఫ్లో 69,000 క్యూ సెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 78,503 క్యూ సెక్కులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటిమట్టం 1045 ఫీట్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1044.849 ఫీట్లుగా ఉంది.. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు అయితే.. ప్రస్తుత నీటి నిల్వ 9.562 టీఎంసీలుగా ఉంది.. ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రలలో 11 యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.. ఎత్తి పోతల పథకాలకు నీటిని విడుదల చేశారు ఇరిగేషన్ అధికారులు..
తాజావార్తలు
-
Jadal Look: “మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా”.. ‘ది ప్యారడైజ్’ లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
-
Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
-
Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
-
Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
-
Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!