Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పార్టీలు సత్తా చాటాయి.. ఈ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. పట్టణ, నగర ప్రజలు కూటమి ప్రభుత్వ పాలనపై విశ్వాసం చూపించారని జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈవీఎంల ద్వారా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనైనా, బ్యాలెట్ ద్వారా నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా ప్రజలు కూటమి పక్షానే నిలిచారని పేర్కొన్నారు. జనసేనకు పట్టణ, నగర ప్రాంతాల్లో లభిస్తున్న ఆదరణ ఎంతో విలువైనదని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన పార్టీ తమ పరాజయానికి ఈవీఎంలను నిందించిందని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. అయితే ఇప్పుడు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించిన స్థానిక ఎన్నికల్లోనూ ప్రజలు కూటమికి అదే స్థాయిలో విజయాన్ని అందించారని అన్నారు. ఈ ఫలితాలు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, పాలనపై ప్రజలు వ్యక్తం చేస్తున్న విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.
మరోవైపు.. స్థానిక ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీకి అండగా నిలిచిన ఓటర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు పవన్ కల్యాణ్.. కూటమి పక్షాలకు అఖండ విజయాలు అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. జనసేనకు బలమైన మద్దతు ఇచ్చిన పట్టణ, నగర ఓటర్ల ఆదరణను పార్టీ ఎంతో విలువైనదిగా భావిస్తోందన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
Also Read
- Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
- MPTC, ZPTC ఎన్నికలకు భారీ పోలీస్ బందోబస్తు.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటన
- YS Jagan: చంద్రబాబు టీమ్‌కు కంగ్రాట్స్.. వైఎస్ జగన్ సంచలన ట్వీట్
- CM Chandrababu: మురసు తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. 45 వేల మందికి పైగా అధికారులతో టెలికాన్ఫరెన్స్
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
-
MPTC, ZPTC ఎన్నికలకు భారీ పోలీస్ బందోబస్తు.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటన
-
US Strike on Iran: ఇరాన్ వైమానిక రక్షణ కేంద్రం ధ్వంసం.. ట్రంప్ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!