NTV Telugu Site icon

Nandamuri Balakrishna: బాలయ్య హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌..

Helicopter

Helicopter

Nandamuri Balakrishna: నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ఒంగోలు పీటీసీ గ్రౌండ్స్ లో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు.. తన తాజా చిత్రం వీర సింహారెడ్డి ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కోసం నిన్న ఒంగోలు వెళ్లిన బాలయ్య.. రాత్రి అక్కడే బస చేశారు.. అయితే, ఇవాళ ఉదయం ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు.. కానీ, హెలికాప్టర్‌ బయల్దేరిన 15 నిమిషాలకే వాతావరణం అనుకూలించకపోవడంతో వెనుదిరిగింది.. పీటీసీ గ్రౌండ్స్‌లో అత్యవసరం ల్యాండ్‌ అయ్యింది.. ప్రస్తుతం ఏటీసీ క్లియరెన్స్ కోసం ఎదరుచూస్తోంది హెలిక్రాఫ్టర్.. ఇక, హెలికాప్టర్‌ కోసం ఒంగోలు పీటీసీ గ్రౌండ్స్ లో హీరో నందమూరి బాలకృష్ణ, హీరోయిన్‌ శృతిహాసన్‌, తదితరులు వేచి చూస్తున్నారు..

Read Also: Gold and Silver Markets: గోల్డ్, సిల్వర్.. 2022 కంటే బెటర్..

కాగా, నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ `వీర సింహారెడ్డి..కి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక, శుక్రవారం ఒంగోలులో జరిగిన రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేదికగా ట్రైలర్‌ను వదిలి మూవీపై మరింత హైప్‌ క్రియేట్‌ చేసింది చిత్ర యూనిట్.. బాలయ్య ఊర మాస్ లుక్, పంచ్‌ డైలాగ్స్‌ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. “సీమలో ఏ ఒక్కడు కట్టి పట్టకూడదని.. నేనొక్కడినే కత్తి పట్టా.. పరపతి కోసమో, పెత్తనం కోసమో కాదు.. ముందు తరాలు నాకిచ్చిన బాధ్యత.. నాది ఫ్యాక్షన్ కాదు.. సీమ మీద ఎఫెక్షన్.. వీరసింహారెడ్డి.. పుట్టి పులిచర్ల.. చదివింది అనంతపురం.. రూలింగ్ కర్నూల్” అంటూ బాలయ్య బేస్ వాయిస్ తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం అదిరిపోయింది.

ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ.. మొదట తండ్రి ఎన్టీఆర్ శతదినోత్సవం కావడంతో ఆయనను తలుచుకున్నారు. ఆయన లేనిది తాను లేనని తెలిపాడు. విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు. అభిమానం అంటే డబ్బుతో కొనేది కాదని, కొన్ని ప్రలోభాలకు లోను కానిది అభిమానం.. ఆ అభిమానం తనకు ఉందని అన్నాడు. గోపీచంద్ మలినేని లాంటి అభిమాని ఈ సినిమా తీయడం ఎంతో ఆనందంగా ఉందని.. ముత్యాలు ఏటవాలుగా దొర్లుతుంటే ఎంత అందంగా ఉంటాయో.. ప్రతి నటీనటులు నుంచి కూడా నటనను అలా తీసి ఒక అందమైన సినిమాగా తీసాడని చెప్పుకొచ్చాడు. ఇక మధ్య మధ్యలో సినిమా డైలాగులను వినిపించి అభిమానులను అబ్బురపరిచిన బాలయ్య తన అన్ స్టాపబుల్ షో గురించి కూడా చెప్పుకొచ్చారు. బాలకృష్ణను ఇంకా దగ్గరగా చూడాలన్న ఆ అభిమానుల కోరిక ఉన్నదో.. రాడులే.. తను రాజకీయాలకు, సినిమాలకే పరిమితంలే.. అనుకున్నవారికి ఆహా ద్వారా అన్ స్టాపబుల్ షో చేసి.. ఈరోజు మొత్తం ప్రపంచంలోనే టాక్ షోలకు అమ్మ మొగుడై కూర్చుంది అంటూ వ్యాఖ్యానించారు.