Nandamuri Balakrishna: బాలయ్య హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Balakrishna: నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఒంగోలు పీటీసీ గ్రౌండ్స్ లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.. తన తాజా చిత్రం వీర సింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం నిన్న ఒంగోలు వెళ్లిన బాలయ్య.. రాత్రి అక్కడే బస చేశారు.. అయితే, ఇవాళ ఉదయం ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు.. కానీ, హెలికాప్టర్ బయల్దేరిన 15 నిమిషాలకే వాతావరణం అనుకూలించకపోవడంతో వెనుదిరిగింది.. పీటీసీ గ్రౌండ్స్‌లో అత్యవసరం ల్యాండ్ అయ్యింది.. ప్రస్తుతం ఏటీసీ క్లియరెన్స్ కోసం ఎదరుచూస్తోంది హెలిక్రాఫ్టర్.. ఇక, హెలికాప్టర్ కోసం ఒంగోలు పీటీసీ గ్రౌండ్స్ లో హీరో నందమూరి బాలకృష్ణ, హీరోయిన్ శృతిహాసన్, తదితరులు వేచి చూస్తున్నారు..
Read Also: Gold and Silver Markets: గోల్డ్, సిల్వర్.. 2022 కంటే బెటర్..
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
కాగా, నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ `వీర సింహారెడ్డి..కి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక, శుక్రవారం ఒంగోలులో జరిగిన రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేదికగా ట్రైలర్‌ను వదిలి మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్.. బాలయ్య ఊర మాస్ లుక్, పంచ్ డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. “సీమలో ఏ ఒక్కడు కట్టి పట్టకూడదని.. నేనొక్కడినే కత్తి పట్టా.. పరపతి కోసమో, పెత్తనం కోసమో కాదు.. ముందు తరాలు నాకిచ్చిన బాధ్యత.. నాది ఫ్యాక్షన్ కాదు.. సీమ మీద ఎఫెక్షన్.. వీరసింహారెడ్డి.. పుట్టి పులిచర్ల.. చదివింది అనంతపురం.. రూలింగ్ కర్నూల్” అంటూ బాలయ్య బేస్ వాయిస్ తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం అదిరిపోయింది.
ప్రీరిలీజ్ ఈవెంట్లో బాలకృష్ణ మాట్లాడుతూ.. మొదట తండ్రి ఎన్టీఆర్ శతదినోత్సవం కావడంతో ఆయనను తలుచుకున్నారు. ఆయన లేనిది తాను లేనని తెలిపాడు. విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు. అభిమానం అంటే డబ్బుతో కొనేది కాదని, కొన్ని ప్రలోభాలకు లోను కానిది అభిమానం.. ఆ అభిమానం తనకు ఉందని అన్నాడు. గోపీచంద్ మలినేని లాంటి అభిమాని ఈ సినిమా తీయడం ఎంతో ఆనందంగా ఉందని.. ముత్యాలు ఏటవాలుగా దొర్లుతుంటే ఎంత అందంగా ఉంటాయో.. ప్రతి నటీనటులు నుంచి కూడా నటనను అలా తీసి ఒక అందమైన సినిమాగా తీసాడని చెప్పుకొచ్చాడు. ఇక మధ్య మధ్యలో సినిమా డైలాగులను వినిపించి అభిమానులను అబ్బురపరిచిన బాలయ్య తన అన్ స్టాపబుల్ షో గురించి కూడా చెప్పుకొచ్చారు. బాలకృష్ణను ఇంకా దగ్గరగా చూడాలన్న ఆ అభిమానుల కోరిక ఉన్నదో.. రాడులే.. తను రాజకీయాలకు, సినిమాలకే పరిమితంలే.. అనుకున్నవారికి ఆహా ద్వారా అన్ స్టాపబుల్ షో చేసి.. ఈరోజు మొత్తం ప్రపంచంలోనే టాక్ షోలకు అమ్మ మొగుడై కూర్చుంది అంటూ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!