Janasena: మహిళలకు రక్షణ ఎక్కడ? సీబీఐ దత్తపుత్రుడిలో చలనం లేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాలపై ఆందోళన వ్యక్తం చేశారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎక్కడ..? మాటలు తప్ప చేతలు లేని చేతగాని ప్రభుత్వమిది.. వరుసగా మహిళలపై అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నా సీబీఐ దత్తపుత్రుడిలో చలనం లేదు అంటూ ఫైర్ అయ్యారు మనోహర్.. పోలీసులను రాజకీయ అవసరాలకు వాడుకుంటూ శాంతి భద్రతలను గాలికొదిలేశారని ఆరోపించిన ఆయన.. దిశ చట్టం చేశాం.. గన్ కంటే జగన్ ముందు వస్తాడు.. లాంటి మాటలు చెప్పడం తప్ప వైసీపీ పాలకులు.. యువతులకు, మహిళలకు ఇసుమంతైనా రక్షణ ఇస్తున్నారా..? అని తన ప్రకటన ద్వారా ప్రభుత్వాన్ని నిలదీశారు.
Read Also: High Court: ఆరుగురు ఐఏఎస్‌లకు ఊరట… సేవా శిక్ష సస్పెండ్..
Also Read
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్‌కు తేదీ ఖరారు.!
- APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్‌పై భారీ విజయం.!
వైసీపీ పాలనలో మాటలు తప్ప చేతలు లేకపోవడం వల్లే అఘాయిత్యాలు చోటు చేసుకొంటున్నాయని విమర్శించారు నాదెండ్ల.. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో వివాహితపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టి హత్య చేసిన ఘటన బాధాకరమని పేర్కొన్న ఆయన.. కొల్లూరు మండలం చిలమూరులోనూ పట్టపగలే ఓ మహిళ హత్యకు గురవ్వడం దురదృష్టకరం అన్నారు. ఒక సంఘటన మరువక ముందే మరో సంఘటన జరుగుతోంది.. ఇంత జరుగుతోన్నా.. సీబీఐ దత్తపుత్రుడిలో చలనం లేదు.. మహిళల రక్షణ విషయంలో పాలకులకు చిత్తశుద్ధి లోపించడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. ఇలాంటి దారుణాలకు ఒడిగట్టేవారికి భయం అనేది లేకుండాపోయిందని.. చట్టాలు చేశాం, యాప్ తెచ్చాం అని ప్రకటనలు మాత్రమే చేసే చేతగాని ప్రభుత్వం వల్ల ఆడబిడ్డలకు ధైర్యం కలగడం లేదన్నారు.
సీఎం ఇంటికి సమీపంలో కృష్ణా నది ఒడ్డున గతేడాది జులైలో సామూహిక అత్యాచారం చోటు చేసుకొంటే ఇప్పటికీ ఓ నిందితుడిని పట్టుకోలేదు.. వైసీపీ ప్రభుత్వం పోలీసు శాఖను తమ రాజకీయ అవసరాలకు వాడుకుంటూ శాంతిభద్రతలు గాలికొదిలేసిందని ఆరోపించారు. వైసీపీ ఫ్లెక్సీలు చిరిగితే స్కూలు పిల్లలను పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టే స్థితికి ఆ శాఖను దిగదార్చారని విమర్శించారు.. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయి అని చెప్పుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం? అని ప్రశ్నించారు. ఆడబిడ్డలకు రక్షణ కల్పించి.. అఘాయిత్యాలకు పాల్పడేవారిపై కఠిన శిక్షలు పడేలా కేసులు నమోదు చేసినప్పుడు ఆ అవార్డులకు విలువ ఉంటుందన్నారు నాదేండ్ల మనోహర్.
తాజావార్తలు
-
Modi-Meloni: ఇటీవల రోమ్‌లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్‌పై మెలోని అభినందనలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్‌ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!