MVV Satyanarayana Family: విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు కిడ్నాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishaka MP MVV Satyanarayana Family Kidnapped: ఏపీలో కిడ్నాప్ కలకలం రేగింది. ఏకంగా అధికార వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ఆడిటర్ జీవీలను కిడ్నాపర్లు అపహరించారని తెలుస్తోంది. ఈ రోజు ఉదయం రిషికొండలోని ఆయన ఇంట్లోకి దూరిన దుండగులు వారిని కిడ్నాప్ చేశారని చెబుతున్నారు. ఉదయం 6-7 గంటల మధ్య ఈ ఘటన జరిగిందని వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కిడ్నాప్ జరిగిన సమయంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ హైదరాబాద్ లో ఉన్నారని సమాచారం. ఉదయం ఎంపీ ఇంటికి చేరుకున్న దుండగులు సీతమ్మధారలో ఉన్న ఆడిటర్ జీవీకి ఎంపీ భార్యతోదుండగులు భయపెట్టి ఫోన్ చేయించారు.
ఆయన వచ్చాక ముగ్గురిని కలిపి అపహరించారు. అయితే నిజానికి ఎవరు చేశారు అనే సమాచారం ప్రాధమికంగా లేకపోయినా రౌడీ షీటర్ హేమంత్ మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎంవీవీ వర్గీయులు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు సినిమాల నిర్మాణం కూడా చేస్తూ ఉంటారు. ఎంపీకి చెందిన కంపెనీలకు అడిటర్ గా జీవీ వ్యవహరిస్తున్నారు. ఆ కంపెనీలకు మాత్రమే కాక ఇతర కంపెనీలకు కూడా జీవీ ఆడిటర్ గా వ్యవహరిస్తూ ఉంటారు. ఇక ఈ వ్యాపార గొడవలే కిడ్నాప్ కు కారణమయ్యాయా? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అధికార పార్టీ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ కావడంతో పూర్తి వివరాలను పోలీసులు బయట పెట్టడం లేదు. అలాగే ఈ విషయం మీద అధికారిక ప్రకటన కూడా లేదు. కిడ్నాప్ అయిన సమాచారం మాత్రమే వెలుగులోకి అది కూడా ఆలస్యంగా వచ్చింది. మరోపక్క ఆడిటర్ ఆచూకీ లభ్యం అయిందని కూడా అంటున్నారు కానీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read
- Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
తాజావార్తలు
-
Air Conditioner: ఏసీని ఈ ఉష్ణోగ్రతలో పెడితే కరెంట్ బిల్లు తగ్గుతుందా? చాలామందికి తెలియని నిజాలు
-
Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
-
Prabhas : ‘స్పిరిట్’ పవర్ఫుల్ డైలాగ్ లీక్? థియేటర్స్ షేక్ అవడం గ్యారెంటీ
-
OTT : పెద్ద సినిమాలకు ఓటీటీ డీల్ కాకుంటే రిలీజ్ డేట్ ప్రకటించరా?
-
Google AI Scam Call Detection: గూగుల్ నుంచి కొత్త AI స్కామ్ కాల్ డిటెక్షన్ ఫీచర్.. యూజర్లకు భారీ ఊరట
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!