MP Mithun Reddy Talks About Kuppam Bogus Vote: బోగస్ ఓట్లు తొలగింపుపై ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి స్పందించారు. చిత్తూరు జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. బోగస్ ఓట్లు అంటూ టీడీపీ విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. టీడీపీ వారు బలంగా ఉన్న చోట గతంలో బోగస్ ఓట్లు పెట్టుకున్నారని.. ఇప్పుడు అవే దొంగ ఓట్లు అంటూ ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆ ఓట్లు ఎప్పుడు నమోదు అయ్యాయో కూడా తమ వద్ద రికార్డ్ ఉందని అన్నారు. దొంగే దొంగ అన్నట్టుగా టీడీపీ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. ఓట్లు తొలగించి, దొంగ ఓట్లు సిద్దం చేసిన ఘనత టీడీపీదేనని ఆరోపించారు. దొంగ ఓట్లు తొలగించాలని తామే ఎలక్షన్ కమిషన్‌ను కోరుతున్నామని పేర్కొన్నారు. కుప్పంలోనూ అనేక దొంగ ఓట్లు ఉన్నట్టు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు.
Maga Princes: మనవరాలి పేరును అధికారికంగా ప్రకటించిన చిరంజీవి
చంద్రబాబు తన సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో ప్రతీసారి ఎలా గెలుస్తున్నాడో తమకు అర్థం కాలేదని.. ఆ అనుమానంతోనే తాము ఓటర్ల జాబితాను పరిశీలిస్తే, వేల సంఖ్యలో దొంగ ఓట్లు ఉన్నట్లు గుర్తించామని మిథున్ రెడ్డి అన్నారు. గత ఎన్నికలకు ముందు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల బోగస్ ఓట్లను నమోదు చేయించారని చెప్పారు. అయితే.. తాము గతంలో కొన్ని దొంగ ఓట్లను తొలగించామని స్పష్టం చేశారు. టీడీపీ ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకోవాలని హితవు పలికారు. దేశంలో రెండో స్థానంలో ఉన్న విజయ డెయిరీను చంద్రబాబు మూసేశారని.. మళ్లీ వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఆ డెయిరీని అమూల్ ద్వారా ప్రారంభించడానికి సిద్ధం చేశారని తెలిపారు. ఈ నెల 4న ముఖ్యమంత్రి ఆ పనుల్ని ప్రారంభిస్తారని స్పష్టం చేశారు. పాడి రైతులకు మళ్ళీ మంచి రోజులు వస్తాయని చెప్పుకొచ్చారు.
Uttar Pradesh: భార్యను కాల్చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు.. కొన ఊపిరితో ఉన్నా కాపాడని ప్రజలు