Margani Bharath: ఒడిశా రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Margani Bharath Demands Investigation On Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆధునిక సాంకేతికత కాలంలో.. సిగ్నల్ వ్యవస్థ దెబ్బతిని, ఘోరమైన రైలు ప్రమాదం జరగడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం.. ఈ రైలు ప్రమాదంపై రాజమండ్రి రైల్వే స్టేషన్‌ను పరిశీలించి, ప్రమాదంలో చిక్కుకున్న రాజమండ్రి ప్రయాణికుల గురించి ఆరా తీశారు. రైల్వే అధికారులతో ప్రమాదంపై సమీక్షించారు. రాజమండ్రికి చెందిన 26 మంది ప్రయాణికుల్లో 12 మంది సెల్ఫోన్లు రెస్పాన్స్ కావడం లేదు. ఇప్పటికే ఈ ప్రమాదంపై సీఎం జగన్ స్పందించి.. ప్రత్యేకంగా అంబులెన్స్‌లు పంపారని, మోనటరింగ్, సహాయక చర్యల కోసం ప్రత్యేక అధికారులను నియమించారు.
David Warner: ఇది హాస్యాస్పాదం.. ఆస్ట్రేలియా బోర్డుపై వార్నర్ ఫైర్
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
ఇదిలావుండగా.. శుక్రవారం సాయంత్రం ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొనడానికి కారణం, రైలు ట్రాఫిక్‌ను ట్రాక్ చేసే భారతీయ రైల్వే వ్యవస్థ తప్పిదమేనని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనలో 288 మందికిపైగా మృతి చెందరగా.. 1000 మందికి పైగా గాయపడ్డారు. రైలు నంబర్ 12841 కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు అప్‌మెయిన్ లైన్ కోసం సిగ్నల్ ఇవ్వగా.. అది లూప్ లైన్లోకి ప్రవేశించింది. అప్పటికే ఆ లైన్లో ఉన్న గూడ్స్ రైలుని డీకొని, పట్టాలు తప్పడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది. కోరమండల్ రైలులో 19 బోగీలు పట్టాలు తప్పాయి. సంఘటనా స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పరిశీలించి, సహాయక చర్యలపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మరోవైపు.. ఈ రైలులో మొత్తం 178 మంది తెలుగువారు ప్రయాణించారని తెలిసింది. వారిలో మృతులు, గాయపడ్డవారు, మిస్సింగ్ వివరాల సమాచారాల్ని అధికారులు సేకరిస్తున్నారు.
Khiladi Lady: కి‘లేడీ’.. అధిక వడ్డీ ఆశ చూపి రూ.41 లక్షలు స్వాహా
తాజావార్తలు
-
WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
-
H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే!
-
IRUMUDI OTT : ప్లాప్స్ ఉన్నాకూడా రవితేజ ‘ఇరుముడి’ ఓటీటీ రైట్స్ భారీ ధర పలికాయి
-
Vanda Devullu Trailer : ‘బిచ్చగాడు’ హీరో మూవీ ‘వంద దేవుళ్ళు’ ట్రైలర్ చూశారా ? గుండెల్ని మెలిపెట్టే ఎమోషన్స్
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!