Woman Trapped Another Woman In The Name Of Interest In Medak: డబ్బంటేనే కిక్.. అందునా అధిక వడ్డీ వస్తుందంటే, ఎవరు టెంప్ట్ అవ్వకుండా ఉంటారు చెప్పండి? నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చని భావించి, వెంటనే ముందుకొస్తున్నారు. అలాగే ఒక మహిళ అధిక వడ్డీ వస్తుందని, తనకు తెలిసిన ఓ మహిళకు అప్పుగా భారీ డబ్బులు ఇచ్చింది. తీరా వడ్డీ అడిగే సమయానికి ఆమె ప్లేటు ఫిరాయించడంతో.. లబోదిబోమంటోంది. ఆ కిలాడీ లేడీ పన్నిన పన్నాగానికి.. పాపం ఆ మహిళ రూ.41 లక్షలకు పైగా డబ్బులు పోగొట్టుకోవలసి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Odisha Train Accident LIVE UPDATES: ఒడిశా రైలు ప్రమాదం.. సహాయక చర్యలపై ప్రధాని మోడీ ఆరా
మెదక్‌లోని జేఎన్‌రోడ్డులో కృష్ణవేణి, హన్మంత్ అనే దంపతులు నివాసముంటున్నారు. వీళ్లు పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లిలో ఉన్న తమ నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాల భూమిని కొంతకాలం క్రితం రూ.60 లక్షలకు అమ్మారు. అప్పటి నుంచి తెలిసిన వారికి వడ్డీకి డబ్బులు ఇస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా.. కృష్ణవేణికి కొన్ని రోజుల క్రితం గజ్వేల్‌కు చెందిన వడ్డీవ్యాపారం చేసే ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. నీ దగ్గరున్న డబ్బిస్తే.. అధిక వడ్డీ ఇప్పిస్తానని కృష్ణవేణిని నమ్మించింది. తనకు ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశతో.. కృష్ణవేణి తన భర్తకు తెలియకుండా ఆ మహిళకు మూడేళ్ల వ్యవధిలో రూ.32 లక్షలు ఇచ్చింది. డబ్బు ఎప్పుడు ఇస్తావని అడిగిన ప్రతీసారి.. వడ్డీతో సహా ఇస్తానని చెప్తూ వచ్చింది. మూడేళ్లు గడిచినా నయా పైసా ఇవ్వకపోవడంతో.. కృష్ణవేణికి అనుమానం వచ్చి, విషయాన్ని తన భర్త హన్మంత్‌తో సహా కుటుంబసభ్యులకు తెలియజేసింది.
Raashi Khanna: అద్దం ముందు అమ్మడి ఎద అందాల ఆరబోత.. హీటెక్కిస్తోందే
అప్పుడు హన్మంత్ సదరు మహిళతో మాట్లాడగా.. ఆమె మరో ప్లాన్ వేసింది. తనకు మరో 9.40 లక్షలు ఇస్తే మొత్తం 41.40 లక్షలు అవుతుందని.. అందుకు తాను వడ్డీతో కలిపి మొత్తం రూ.57 లక్షలు ఇస్తానని నమ్మబలికింది. దాంతో హన్మంత్, అతని కొడుకు కలిసి ఆమె అకౌంట్‌కి డబ్బులు పంపించారు. అయితే.. అనుకున్న సమయానికి డబ్బులు ఇవ్వకపోవడంతో, వాళ్లు సదరు మహిళను నిలదీశారు. అప్పుడు ఆ మహిళ, అసలు మీరు నాకు డబ్బులే ఇవ్వలేదంటూ ప్లేటు ఫిరాయించారు. దీంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెని పోలీస్ స్టేషన్‌కి పిలిపించి విచారించగా.. వాళ్లు తనకు డబ్బులు ఇవ్వలేదని, వారివద్ద సాక్ష్యం ఉంటే కోర్టుకు వెళ్లమని చెప్పింది. ఈ దెబ్బకు బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.